యాప్నగరం

నిశబ్ద యోధుడా.. సాధించావు: సచిన్

శ్రీలంక గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నా.. ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ మాత్రం మెరుగైన

TNN 4 Oct 2017, 12:59 pm
శ్రీలంక గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నా.. ఆ జట్టు సీనియర్ స్పిన్నర్ రంగనా హెరాత్ మాత్రం మెరుగైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌తో అబుదాబి వేదికగా జరిగిన తొలి టెస్టులో మొత్తం 11 వికెట్లు (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) పడగొట్టిన రంగనా హెరాత్ టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఐదో స్పిన్నర్‌గా నిలిచిన హెరాత్.. ఎడమ చేతి వాటం స్పిన్నర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానంలో నిలిచాడు.
Samayam Telugu sachin tendulkar praises silent warrior rangana herath
నిశబ్ద యోధుడా.. సాధించావు: సచిన్


రంగనా హెరాత్ ధాటికి ఆ మ్యాచ్‌లో 136 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన పాకిస్థాన్ అనూహ్యంగా 114 పరుగులకే కుప్పకూలిపోయింది. ‘టెస్టుల్లో 400 వికెట్ల‌ు తీసి అద్భుతమైన ఘనతని అందుకున్న శ్రీలంక నిశబ్ద యోధుడు.. రంగనా హెరాత్‌కి అభినందనలు’ అని సచిన్ తెందుల్కర్ ట్వీట్ చేశాడు. కెరీర్‌లో 84వ టెస్టులోనే ఈ అరుదైన మైలురాయిని అందుకున్న హెరాత్.. 71 వన్డేల్లో తీసింది 74 వికెట్లు మాత్రమే. సెప్టెంబరు 22, 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఈ స్పిన్నర్ అరంగేట్రం చేశాడు.

Tremendous achievement to get to 400 test wickets by one of the silent warriors of @OfficialSLC! Congratulations and we'll done, @HerathRSL! pic.twitter.com/zcbkucMLsd — sachin tendulkar (@sachin_rt) October 3, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.