యాప్నగరం

కోహ్లిసేనకి ఆ తెలివి ఉండాలి: సచిన్

స్వదేశీ, విదేశీ పిచ్‌ల స్వభావాన్ని అర్థం చేసుకుని టీమిండియా టెస్టులు ఆడాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్

TNN 13 Jan 2018, 5:38 pm
స్వదేశీ, విదేశీ పిచ్‌ల స్వభావాన్ని అర్థం చేసుకుని టీమిండియా టెస్టులు ఆడాలని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ సూచించారు. దక్షిణాఫ్రికాతో ఇప్పటికే ముగిసిన తొలి టెస్టులో భారత్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవగా.. బౌలర్లు సత్తాచాటారు. భారత్‌‌ పిచ్‌లపై ఆడిన తరహాలోనే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆదిలోనే స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించడంతోనే వికెట్లు చేజార్చుకున్నట్లు సచిన్ అభిప్రాయపడ్డారు. సెంచూరియన్ వేదికగా శనివారం రెండో టెస్టు ప్రారంభమైన నేపథ్యంలో సచిన్ మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu sachin tendulkar suggests india batsmen check their strokes while playing abroad
కోహ్లిసేనకి ఆ తెలివి ఉండాలి: సచిన్


‘టెస్టు క్రికెట్ అనేది అర్థం చేసుకుని స్థానిక పరిస్థితులకి అనుగుణంగా ఆడేది. భారత్‌ పిచ్‌లతో పోలిస్తే.. విదేశీ పిచ్‌లు పూర్తి భిన్నం. భారత్‌ గడ్డపై అయితే.. బౌలర్లకి 20 ఓవర్ల తర్వాతే పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. రివర్స్ స్వింగ్‌కి అవకాశం దొరుకుతుంది. కానీ.. దక్షిణాఫ్రికా లాంటి పిచ్‌లపై అది పూర్తిగా రివర్స్. మొదటి 25 ఓవర్లు ఫాస్ట్ బౌలర్లకి స్వర్గధామంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని.. భారత్‌లో ఆడినట్లు బ్యాట్స్‌మెన్ ఆరంభంలోనే స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించకూడదు’ అని సచిన్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.