యాప్నగరం

ఏదీ పట్టించుకోవద్దు, సంతృప్తి చెందావో.. : కోహ్లికి సచిన్ సలహా

తొలి టెస్టులో అద్భుత శతకం చేసిన విరాట్ కోహ్లికి లార్డ్స్ టెస్టు ముందు సచిన్ కీలక సలహా ఇచ్చాడు.

Samayam Telugu 8 Aug 2018, 1:31 pm
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కెప్టెన్ కోహ్లి రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులు ఎత్తేయడంతో టీమిండియా చేతులు ఎత్తేసింది. గురువారం నుంచి లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ లార్డ్స్‌లో భారత్ 17 టెస్టులు ఆడితే కేవలం రెండింట్లోనే గెలుపొందింది. తొలి టెస్టులో కొద్ది తేడాతో ఓడటంతో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో భారత్ బరిలో దిగబోతోంది. ఈ నేపథ్యంలోనే కెప్టెన్ కోహ్లికి సచిన్ సలహాలు ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది.
Samayam Telugu sachin-kohli


‘తొలి టెస్టులో ఆడినట్టుగానే.. అదే ఆటతీరును కనబర్చు. అద్భుతంగా ఆడుతున్నావ్.. దాన్నే కొనసాగించ’మని కోహ్లికి సచిన్ సలహా ఇచ్చాడు. ‘చుట్టూ ఏం జరుగుతుందో నీకు అనవసరం. నువ్వేం చేయాలని అనుకుంటున్నావో దాని మీదే ఏకాగ్రత పెట్టు. నీ మనసు మాట విను. నీ జీవితంలో ఏం జరగాలని కోరుకుంటున్నావో.. అందుకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయ’ని సచిన్ కోహ్లికి తెలిపాడు.

తొలి టెస్టు ఫలితం కోహ్లి నిరుత్సాహపర్చి ఉండొచ్చు. కానీ ఎడ్జ్‌బాస్టన్‌లో సాధించిన దానికి వ్యక్తిగతంగా అతడు గర్వించాలి. 2014 నాటి చేదు జ్ఞాపకాలను మర్చిపోయి అతడు ఆడిన విధానం బాగుందని సచిన్ కితాబిచ్చాడు. ఆకలిగొన్న పులిలా పరుగులు సాధించు. నా అనుభవంతో చెబుతున్నా. నువ్వు ఎన్ని పరుగులు చేసినా అవి ఎప్పటికీ సరిపోవని సచిన్ తెలిపాడు.

ఒక్కసారి నీలో సంతృప్తి కనపడిందో పతనం ప్రారంభం అవుతుంది. సంతోషంగా ఉండటం ఓకే కానీ, బ్యాట్స్‌మెన్‌గా ఎప్పటికీ సంతృప్తి చెందొద్దని సచిన్ సీరియస్ సలహా ఇచ్చాడు. బౌలర్లు కేవలం పది వికెట్లు మాత్రమే తీయగలరు. కానీ బ్యాట్స్‌మెన్ అలా కాదు.. ఎన్ని పరుగులైనా చేయగలరు. కాబట్టి సంతృప్తి చెందొద్దు, సంతోషంగా మాత్రమే ఉండాలని క్రికెట్ గాడ్ సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.