యాప్నగరం

మెంటల్ వచ్చిందా..? ధోనీ రిటైర్మెంట్‌ రూమర్స్‌పై సాక్షి ఫైర్

ధోనీ రిటైర్మెంట్ గురించి గత ఏడాది నుంచి పదుల సంఖ్యలో రూమర్స్ వినిపించాయి. కొన్నింటిని లైట్ తీసుకున్న అతని భార్య సాక్షి.. కొన్ని సందర్భాల్లో మాత్రం సహనం కోల్పోయి మరీ చురకలు వేస్తోంది.

Samayam Telugu 28 May 2020, 8:31 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ధోనీ.. ఆ తర్వాత క్రికెట్‌కి పూర్తిగా దూరమైపోయాడు. వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌తోనే అతను రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. ఆ టోర్నీ తర్వాత మౌనంగా ఉండిపోయిన ధోనీ.. రిటైర్మెంట్‌పై ఎన్ని వార్తలు వచ్చినా ఈ 10 నెలల్లో ఒక్కసారి కూడా పెదవి విప్పలేదు. అయితే.. అతని భార్య సాక్షి మాత్రం అప్పుడప్పుడు ఆ రూమర్స్‌పై మండిపడుతోంది. కానీ.. అవి మాత్రం ఆగడం లేదు.
Samayam Telugu MS Dhoni ,Sakshi


Read More: బిషప్ దశాబ్దాపు వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీ.. మరో ఇద్దరికీ ఛాన్స్


ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినట్లు తాజాగా సోషల్ మీడియాలో #DhoniRetires కీవర్డ్ ట్రెండ్‌ అయ్యింది. దాంతో.. సహనం కోల్పోయిన సాక్షి అది కేవలం రూమర్ మాత్రమే అని ఖండిస్తూ ఈ లాక్‌డౌన్ ప్రజల్ని మెంటల్ వాళ్లని చేసిందని ఘాటుగా స్పందించింది. అయితే.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ని సాక్షి డిలీట్ చేసింది. కానీ.. అప్పటికే ఆమెపై పెద్ద ఎత్తున అభిమానులు విమర్శలు గుప్పించారు.

Read More: ఐపీఎల్ కోసమే టీ20 వరల్డ్‌కప్ వాయిదా.. మేము ఒప్పుకోం: పాక్ బోర్డు

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఫామ్ నిరూపించుకోవడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ధోనీ ఆశించాడు. ఈ మేరకు మార్చి నెల తొలి వారంలో చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడింది. అయితే.. అక్టోబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండటంతో.. ఆ విండోలో ఐపీఎల్ జరిగే అవకాశం ఉంది.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.