యాప్నగరం

సంగక్కర ఆల్‌టైం క్రికెట్ టీం ఇదే..

శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో భారత్ తరఫున ఎవరికి చోటు దక్కిందో తెలుసా?

TNN 29 Jun 2016, 6:17 pm
శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ఆల్ టైమ్ క్రికెట్ జట్టులో భారత్ తరఫున రాహుల్ ద్రవిడ్ ఒక్కడికే చోటు దక్కింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సహా మరే భారత క్రికెటర్‌కి ఈ జాబితాలో చోటు దక్కకపోవడం విశేషం. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్ మన్ మాథ్యూ హేడన్ కు తన జాబితాలో అగ్రస్థానం ఇచ్చిన సంగక్కర.. ద్రవిడ్‌కు రెండో స్థానం కేటాయించాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్‌లను చేర్చాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియన్ లారాను ఈ లిస్టులో చేర్చిన సంగక్కర ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లకు స్థానం ఇచ్చాడు. సంగ ఆల్‌టైం ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ జాబితాలో తన సహచర ఆటగాడు జయవర్థనే పేరు కానీ, జయసూర్య పేరు కానీ లేకపోవడం విశేషం.
Samayam Telugu sangakkara xi
సంగక్కర ఆల్‌టైం క్రికెట్ టీం ఇదే..


సంగక్కర ప్రకటించిన టీమ్ ఇదే.. మాథ్యూ హేడెన్, రాహుల్ ద్రావిడ్, బ్రియన్ లారా, రికీ పాంటింగ్, అరవింద్ డిసిల్వా(కెప్టెన్), జాక్వలెస్ కల్లిస్, ఆడమ్ గిల్క్రిస్ట్(వికెట్ కీపర్), షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్‌, వసీం అక్రమ్, చమిందా వాస్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.