యాప్నగరం

Sanju Samson: తొలి వన్డేలో నా లెక్క తప్పింది ఇక్కడే.. శాంసన్ భావోద్వేగం!

Sanju Samson: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ 10 పరుగుల తేడాతో ఓడింది. ఆఖరి ఓవర్లో శాంసన్ 20 పరుగులు చేసినప్పటికీ.. టీమిండియా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. 39వ ఓవర్లో సంజూ అసలు స్ట్రయికింగ్‌కు రాకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. ఆఖరి ఓవర్ షంసీ బౌలింగ్ చేస్తాడని తెలిసే తాను చివరి వరకూ వేచి ఉన్నానని శాంసన్ తెలిపాడు. చివరి 18 బంతుల్లో 9 బంతులను మాత్రమే సంజూ ఎదుర్కొన్నాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 7 Oct 2022, 9:34 am

ప్రధానాంశాలు:

  • తొలి వన్డేలో తప్పిన భారత్ అంచనా
  • శాంసన్ ఒంటరి పోరాటం వృథా
  • రెండు షాట్లు కనెక్ట్ అయితే మరోలా..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sanju Samson
Sanju Samson
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడినప్పటికీ సంజూ శాంసన్ పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఫైనల్ ఓవర్లో భారత్ విజయానికి 30 పరుగులు అవసరమైన దశలో మూడో బంతి వరకూ శాంసన్ భారత్‌ను రేసులో ఉంచాడు. కానీ నాలుగో బంతిని కనెక్ట్ చేయలేకపోవడంతో మ్యాచ్ సౌతాఫ్రికా వైపు మొగ్గింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదిన శాంసన్ 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ.. రెండు షాట్లను తాను సరిగా కనెక్ట్ చేయలేకపోయానన్నాడు. నెక్స్ట్ టైం తాను మరింత శ్రమిస్తానని చెప్పాడు. లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైనప్పటికీ.. టీమిండియాకు తనవంతు సహకారం అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారన్న శాంసన్.. షంసీ కొంచెం ఎక్కువగా పరుగులు ఇచ్చాడని.. దీంతో అతణ్ని టార్గెట్ చేయొచ్చని అనిపించిందన్నాడు.

‘‘షంసీ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తాడని మాకు తెలుసు. చివరి ఓవర్లో 24 పరుగులు చేయాల్సి వస్తే నాలుగు సిక్స్‌లు కొట్టగలనని నాకు నమ్మకం ఉంది. అందుకే ఆటను సాధ్యమైనంత వరకూ పొడిగించుకుంటూ పోయాను. అదే మా ప్లాన్.. బ్యాటర్లు చక్కగా రెస్పాండ్ అయ్యారు’’ అని శాంసన్ వ్యాఖ్యానించాడు.

కాగా 18 బంతుల్లో భారత్ విజయానికి 45 పరుగులు అవసరం కాగా.. అందులో శాంసన్ 9 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. 39వ ఓవర్లో శాంసన్ అసలు స్ట్రయికింగ్‌కు రాలేదు. రబాడ వేసిన ఆ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. శాంసన్ 39వ ఓవర్లోనూ స్ట్రయికింగ్ చేసి ఉండుంటే బాగుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.