యాప్నగరం

బీసీసీఐ తీర్పులో సుప్రీం మార్పులు!

జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలు అమలు చేయడంలో విఫలమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఇచ్చిన తీర్పులో మార్పుచేర్పులు చేయడానికి సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది.

TNN 20 Jan 2017, 8:09 pm
జస్టిస్ లోధా కమిటీ సూచించిన సంస్కరణలు అమలు చేయడంలో విఫలమైన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై ఇచ్చిన తీర్పులో మార్పుచేర్పులు చేయడానికి సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర సంఘం, బీసీసీఐలో కలిపి మొత్తం తొమ్మిదేళ్లు ఏదైనా పదవిలో ఉంటే ఆ తరవాత బీసీసీఐలో ఎలాంటి పదవులు చేపట్టడానికి అర్హులు కారని జులై 18న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పులో స్వల్ప మార్పులు చేసింది. రాష్ట్ర క్రికెట్ సంఘం లేదా బీసీసీఐలో తొమ్మిదేళ్లు పదవి చేపట్టిన వారు ఇకపై బీసీసీఐలో ఎలాంటి పదవి చేపట్టడానికి వీల్లేదని సుప్రీం వెల్లడించింది.
Samayam Telugu sc to name bcci admins on jan 24 modifies earlier order
బీసీసీఐ తీర్పులో సుప్రీం మార్పులు!


మరోవైపు బీసీసీఐ కొత్త బాస్‌ను జనవరి 24న సుప్రీం కోర్టు ప్రకటించనుంది. బీసీసీఐ కొత్త పాలకుల ఎంపిక విషయంలో సుప్రీం కోర్టుకు సహాయకులుగా ఉన్న సీనియర్ న్యాయవాదులు అనిల్‌ దివాన్‌, గోపాల్‌ సుబ్రమణియన్‌ తొమ్మిది మంది పేర్లను సూచించారు. ఈ పేర్లను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ రహస్యంగా ఉంచింది. జనవరి 24న తుది జాబితాను ప్రకటిస్తామని ధర్మాసనం వెల్లడించింది.

కాగా, బీసీసీఐలో శాశ్వత సభ్యత్వం కోల్పోయి అసోసియేట్‌ సభ్యులుగా మారిన రైల్వేస్‌, సర్వీసెస్ అండ్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ వాదనను పరిగణలోకి తీసుకోడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ మేరకు అంగీకారం తెలిపారు. చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదని, అందువల్ల జులై 18న ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకోవాలని ఈ సంఘాల తరఫున వాదించిన అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ సుప్రీం కోర్టును కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.