యాప్నగరం

ఒకే బంతికి 11 పరుగులిచ్చిన ఆసీస్ బౌలర్

ఆఖరి ఓవర్.. విజయానికి 9 పరుగులు అవసరం. అలాంటి దశలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన బౌలర్ తేలిపోయాడు. తొలి బంతికే 11 పరుగులిచ్చాడు.

TNN 4 Jan 2018, 12:46 pm
టీ20 లీగ్ చివరి ఓవర్లో బ్యాటింగ్ జట్టు విజయానికి 9 పరుగులు అవసరం. బౌలర్ తొలి మూడు బంతుల్ని కట్టుదిట్టంగా విసిరితే బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. కానీ బౌలరే తీవ్ర ఒత్తిడిలో ఒక్క బంతికే 11 పరుగులిచ్చేశాడు. దీంతో బ్యాటింగ్ జట్టు తేలికగా విజయం సాధించింది. ఈ ఘటన బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్క్రాచర్స్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య చోటు చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పెర్త్ స్క్రాచర్స్.. ఆఖరి ఆరు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి.
Samayam Telugu sean abbott concedes 11 runs off 1 ball in bbl 2017 as perth scorchers beat sydney sixers by 6 wickets
ఒకే బంతికి 11 పరుగులిచ్చిన ఆసీస్ బౌలర్


తమ బౌలర్ సీన్ అబాట్‌పై నమ్మకం ఉంచిన కెప్టెన్ అతడి చేతికి బంతిని అందించాడు. కానీ ఒత్తిడిలో ఉన్న అబాట్ తొలి బంతినే లెగ్ సైడ్ వైడ్‌గా విసిరాడు. అది కాస్తా బౌండరీ చేరడంతో ఐదు పరుగులొచ్చాయి. విజయానికి ఆరు బంతుల్లో 4 పరుగులు మాత్రమే అవసరం కావడంతో బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అబాట్ విసిరిన మరుసటి బంతి ఫుల్ టాస్ కావడంతో ఊపు మీదున్న ఆడమ్ వోగ్స్.. బౌలర్ తల మీదుగా సిక్సర్‌గా మలిచాడు. అబాట్ ఒక్క బంతికే 11 పరుగులు ఇచ్చుకోవడంతో బ్యాటింగ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

11runs_in_1ball from BhaiyyaKhiladi on Vimeo.

తమ బౌలర్ ఏం చేశాడో అర్థం కాక సిడ్నీ సిక్సర్స్ తలపట్టుకోగా... ఆఖరి ఓవర్లో అలవోకగా విజయం సాధించడంతో పెర్త్ స్క్రాచర్స్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలో సంబరాలు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.