యాప్నగరం

మిథాలీ రాజ్‌కు షారుక్ బంపర్ ఆఫర్

భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు.

TNN 3 Jan 2018, 2:09 pm
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరలోనే మిథాలీ భారత పురుషుల జట్టు కోచ్‌గా పని చేయాలని కోరుకుంటున్నానని షారుక్ తెలిపాడు. మిథాలీ నేతృత్వంలోని భారత మహిళల జట్టు గతేడాది ప్రపంచకప్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. షారుక్ నిర్వహించిన ‘టెడ్ టాక్స్ ఇండియా నవీ సోచ్’ అనే కార్యక్రమంలో మిథాలీ పాల్గొంది. ఈ సందర్భంగా బాద్‌షా ఆమెపై ప్రశంసలు గుప్పించాడు.
Samayam Telugu shah rukh khan wants mithali raj to coach kolkata knight riders
మిథాలీ రాజ్‌కు షారుక్ బంపర్ ఆఫర్


‘మైదానంలో బరిలో దిగినప్పుడు ప్రతి ఒక్కరూ ట్రోఫీ తేవాలని కోరుకుంటారు. అలాంటి ఒత్తిడిలోనూ ఏకాగ్రతతో మెరుగ్గా రాణించాలి. ఒత్తిడిని తట్టుకోవడానికి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది. ప్రశాంతంగా ఉండటానికి, మెరుగైన ప్రదర్శన చేయడానికి పుస్తకాలు చదివే అలవాటు ఉపకరిస్తుంద’ని మిథాలీ తెలిపింది.

మిథాలీ రాజ్ తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కోచ్‌గా వ్యవహరించాలని షారుక్ కోరాడు. దీనికి హైదరాబాదీ క్రికెటర్ స్పందిస్తూ.. కోచ్‌గా ఎంపికైతే.. నా వంతుగా శ్రమిస్తానని నవ్వుతూ బదులిచ్చింది. ప్రపంచ కప్‌లో భారత్‌కు రెండు పర్యాయాలు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్ మిథాలీనే కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.