యాప్నగరం

ఐపీఎల్‌లోకి మళ్లీ షేన్‌వార్న్..!

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్‌లో

TNN 6 Feb 2018, 4:08 pm
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 2008లో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టుని ఒంటిచేత్తో విజేతగా నిలిపిన వార్న్.. 2011 వరకు ఈ టోర్నీలో కొనసాగాడు. ఆ తర్వాత క్రికెట్ కామెంటేటర్‌గా మారి తన గళంతో అభిమానుల్ని అలరిస్తున్నాడు. అయితే.. వార్న్ మళ్లీ ఐపీఎల్‌లో‌కి రాజస్థాన్ రాయల్స్‌ తరఫున పునరాగమనం చేయనున్నట్లు కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ.. ప్రధాన కోచ్ లేదా బౌలింగ్‌ కోచ్‌లో ఏ బాధ్యతని అతను తీసుకునేదానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.
Samayam Telugu shane warne confirms rumours of royal return to ipl
ఐపీఎల్‌లోకి మళ్లీ షేన్‌వార్న్..!


‘ఐపీఎల్‌తో నేను మమేకం అవబోతున్నా. ఈ వారంలోనే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తా’ అని షేన్ వార్న్ తాజాగా వెల్లడించాడు. ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 ఐపీఎల్‌ సీజన్లకి దూరంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈ ఏడాది మళ్లీ పునరాగమనం చేయనున్నాయి. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఈ ఏడాది టోర్నీలో తనదైన ముద్ర వేయాలని ఆశిస్తోంది. ఇందులో భాగంగా స్టీవ్ స్మిత్‌ని రూ. 12.5 కోట్లకి అట్టిపెట్టుకున్న రాజస్థాన్.. వేలంలో బెన్‌స్టోక్స్‌ను రూ. 12.5 కోట్లకి, జయదేవ్ ఉనద్కత్‌‌ని రూ. 11.5 కోట్లకి, సంజు శాంసన్‌ని రూ.8 కోట్లకి, రహానెని రూ.4 కోట్లకి కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.