యాప్నగరం

సచిన్ కంటే ఆ రికార్డుల్లో కోహ్లీనే బెస్ట్..!

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించలేని ఘనతల్ని టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే సాధించేశాడని ఆస్ట్రేలియా స్పిన్

Samayam Telugu 14 May 2018, 5:14 pm
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించలేని ఘనతల్ని టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే సాధించేశాడని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకి మెంటార్‌గా పనిచేస్తున్న షేన్ వార్న్.. యువ క్రికెటర్ల నుంచి అద్భుత ప్రదర్శనని రాబడుతున్నాడు. తాజాగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలో ఎవరు అత్యుత్తమ క్రికెటర్..? అనే ప్రశ్నరాగా.. షేన్ వార్న్ సమాధానమిచ్చాడు.
Samayam Telugu 2


‘విరాట్ కోహ్లీ అత్యుత్తమంగా ఆడుతున్నాడు. ముఖ్యంగా జట్టు ఛేజింగ్‌కి దిగిన సమయంలో అతను బాదుతున్న శతకాలు అసాధారణం. క్రికెట్‌లో సచిన్‌తో పాటు ఎవరికీ సాధ్యంకాని రీతిలో విరాట్ కోహ్లి అనితర రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. మా తరంలో సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా అత్యుత్తమ క్రికెటర్లు.. ప్రస్తుత క్రికెట్‌లో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్ ఆ స్థాయి ఆటగాళ్లు. వీరిద్దరి మధ్య పోలిక తేవడం చాలా కష్టం. ఆటపై విరాట్ కోహ్లీ అంకితభావం నాకు బాగా నచ్చుతుంది. మరో పదేళ్లు కోహ్లి క్రికెట్ ఆడగలిగితే.. దిగ్గజ క్రికెటర్ సచిన్ సరసన అతను నిలబడతాడు’ అని షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. వన్డే ఫార్మాట్‌లో టీమిండియా ఛేదనకు దిగిన సమయంలో విరాట్ కోహ్లి ఇప్పటికే 19 శతకాలు బాదగా.. సచిన్ టెండూల్కర్ 17 సెంచరీలే చేశాడు. వన్డే కెరీర్‌లో సచిన్ మొత్తం 51 సెంచరీలు నమోదు చేయగా.. కోహ్లి 35 శతకాలతో అతనికి చేరువ అవుతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.