యాప్నగరం

ఆ కమిటీతో భారత్‌లో క్రికెట్ నాశనం..!

బీసీసీఐ‌లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అందించిన రిపోర్ట్ కారణంగా భారత్‌లో క్రికెట్ నాశనమైందని ఎన్సీపీ చీఫ్,

TNN 10 Nov 2017, 5:39 pm
బీసీసీఐ‌లో సంస్కరణల కోసం సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ అందించిన రిపోర్ట్ కారణంగా భారత్‌లో క్రికెట్ నాశనమైందని ఎన్సీపీ చీఫ్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఘాటుగా విమర్శించాడు. లోధా కమిటీ సిఫార్సు చేసిన కొన్ని సంస్కరణలను బోర్డులో అమలు చేస్తుండటంపై శరద్ పవార్ స్పందన అడగ్గా.. ఆయన పైవిధంగా స్పందించాడు. 2013 ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్‌‌లో.. అప్పటి వరకు బీసీసీఐ ఉన్నత స్థాయిలో పనిచేసిన వ్యక్తి ప్రమేయం పరోక్షంగా ఉండటంతో బోర్డుని సంస్కరించాలని సుప్రీంకోర్టు ఆ కమిటీని 2015లో ఏర్పాటు చేసింది.
Samayam Telugu sharad pawar lodha committee report has destroyed cricket
ఆ కమిటీతో భారత్‌లో క్రికెట్ నాశనం..!


కమిటీ రిపోర్ట్‌లో ఒక రాష్ట్రానికి.. ఒక ఓటు, ఒక వ్యక్తికి బోర్డులో ఒక పోస్ట్, బీసీసీఐలో ఏ స్థాయి ఉద్యోగికైనా వయో పరిమితి 70 ఏళ్లుగా నిర్ణయించడంతో.. కొన్నేళ్లపాటు బోర్డులో చక్రం తిప్పిన 76 ఏళ్ల శరద్ పవార్ లాంటి వ్యక్తులు తమ అధికారాన్ని చేజార్చుకోవాల్సి వచ్చింది. ‘లోధా కమిటీ రిపోర్ట్ నిస్సందేహంగా భారత్‌లో క్రికెట్‌ని సర్వనాశనం చేసింది’ అని శరద్ పవార్ ఘాటుగా వ్యాఖ్యానించడం వెనుక అదే అసలు కారణమని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.