యాప్నగరం

ఆస్ట్రేలియాలోనే ఉండండి.. ముగ్గురు టీమిండియా బౌలర్లకి బీసీసీఐ ఆదేశం

ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయంతో ఆస్ట్రేలియా టూర్‌కి దూరంగా ఉండిపోగా.. మహ్మద్ షమీ కూడా ఇటీవల లయ తప్పాడు. దాంతో జస్‌ప్రీత్ బుమ్రాపై టెస్టుల్లో అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో..?

Samayam Telugu 12 Dec 2020, 11:30 am
ఆస్ట్రేలియా గడ్డపై వన్డే, టీ20 సిరీస్ ముగియడంతో.. ఈ రెండు ఫార్మాట్లకి మాత్రమే ఎంపికైన భారత క్రికెటర్లు స్వదేశానికి పయనమయ్యారు. డిసెంబరు 17 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభంకానుండగా.. టెస్టు టీమ్‌లోని ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. కానీ.. టెస్టు జట్టులోకి ఎంపికవని ముగ్గురు బౌలర్లని కూడా అక్కడే ఉండాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu Team India (Image Credits: Twitter)


గత మంగళవారం టీ20 సిరీస్ ముగియగా.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, యుజ్వేందర్ చాహల్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్ తదితరులు భారత్‌కి బయల్దేరి వచ్చేశారు. కానీ.. ఫాస్ట్ బౌలర్లు శార్ధూల్ ఠాకూర్, టి. నటరాజన్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం అక్కడే ఉండిపోయారు. దాంతో.. ప్రాక్టీస్ సెషన్స్‌లో బౌలింగ్ చేసేందుకు అక్కడే వారిని బీసీసీఐ ఉంచిందా..? లేదా టెస్టుల్లో వీరికి అవకాశం ఇవ్వనుందా అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో నటరాజన్‌ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నటరాజన్ ఇప్పటి వరకూ టెస్టుల్లో ఆడలేదు. అలానే వాషింగ్టన్ సుందర్ కూడా టీ20ల్లో ఆడినా.. ఐదు రోజుల ఫార్మాట్‌‌లో మాత్రం ఇంకా ఆడలేదు. అయితే.. శార్ధూల్ ఠాకూర్ మాత్రం 2018లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో ఆడాడు. కానీ.. చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. డిసెంబరు 17 నుంచి జనవరి 19 వరకూ టెస్టు సిరీస్ జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.