యాప్నగరం

ఫిక్సింగ్.. పాక్ ఓపెనర్‌పై ఐదేళ్ల నిషేధం

స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై నిషేధం వేటు పడింది.

TNN 30 Aug 2017, 3:41 pm
స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడిన పాకిస్థాన్ సీనియర్ ఓపెనర్ షర్జీల్ ఖాన్‌పై నిషేధం వేటు పడింది. ఈ ఏడాది దుబాయ్‌లో ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎ‌ల్) రెండో సీజన్‌లో షర్జీల్ ఖాన్ ఫిక్సింగ్‌‌కి పాల్పడినట్లు నిర్ధారించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనిపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. అతను ఏ ఫార్మాట్‌లోనూ 30 నెలల పాటు ఆడేందుకు వీలులేదని ఈ సందర్భంగా బోర్డు స్పష్టం చేసింది.
Samayam Telugu sharjeel khan handed five year ban by pcb
ఫిక్సింగ్.. పాక్ ఓపెనర్‌పై ఐదేళ్ల నిషేధం


ఐపీఎల్ తరహాలో గత రెండేళ్లుగా పాకిస్థాన్ కూడా పీఎస్‌ఎల్ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ ఏడాది టోర్నీ ఆరంభంలోనే పాక్ జట్టులోని ప్రధాన క్రికెటర్లు ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఓపెనర్లు షర్జీల్ ఖాన్, ఖలీద్ లతీఫ్ బుకీలను స్వయంగా కలిసినట్లు బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. దీనిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ ఆరంభించిన బోర్డు.. తాజాగా షర్జీల్ ఖాన్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు తేలడంతో అతనిపై నిషేధం విధించింది. తొలుత రూ. 20 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారని వార్తలు వచ్చినా.. బోర్డు నిషేధంతోనే సరిపెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.