యాప్నగరం

ఐసీసీలో కుదుపు..శశాంక్ మనోహర్ రాజీనామా

ఎదుగుదలకు తోడ్పడిన బోర్డునే ప్రపంచ వేదికపై ఇబ్బందులకు గురిచేసిన శశాంక్ మనోశర్

TNN 15 Mar 2017, 10:45 pm
బీసీసీఐ అండతో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టి.. అనంతరం తన ఎదుగుదలకు తోడ్పడిన బోర్డునే ప్రపంచ వేదికపై ఇబ్బందులకు గురిచేసిన శశాంక్ మనోశర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఛైర్మన్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించిన శశాంక్ రాజీనామా పత్రాన్ని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్‌కి పంపించారు. ఎనిమిది నెలల క్రితం లోధా కమిటీ సూచనలను భారత క్రికెట్ పాలనలో అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తరుణంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న మనోహర్ చాకచక్యంగా ఐసీసీ ఛైర్మన్ పదవిలోకి జారుకున్నాడు. అనంతరం అధ్యక్ష పదవిని చేపట్టిన అనురాగ్ ఠాకూర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తొలగించిన విషయం తెలిసిందే.
Samayam Telugu shashank manohar steps down as icc chairman
ఐసీసీలో కుదుపు..శశాంక్ మనోహర్ రాజీనామా


‘వ్యక్తిగత కారణాల వల్ల నేను ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నాను. నా రాజీనామా నేటి నుంచే అమల్లోకి వస్తుంది. నాకు సహకరించిన డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్, ఐసీసీ సహాయకులకి ధన్యవాదాలు. ఐసీసీ ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని నేను కోరుకుంటున్నా’ అని మనోహర్ వెల్లడించారు. ఇటీవల అన్ని దేశాల క్రికెట్ ‌బోర్డులకి ఆదాయ పంపిణీ నిర్ణయంలో భారత్‌కి వ్యతిరేకంగా ఐసీసీలో పావులు కదిపిన మనోహర్‌పై బీసీసీఐ గుర్రుగా ఉంది. మనోహర్ రాజీనామా నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన ఐసీసీ త్వరలోనే కొత్త ఛైర్మన్ నియామకాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.