యాప్నగరం

భువీని ఆటపట్టిస్తూ.. ధావన్ ఇంటర్వ్యూ!

పెళ్లి కొడుకు కాబోతున్న భువనేశ్వర్ కుమార్‌ను శిఖర్ ధావన్ ఓ ఆటాడుకున్నాడు. సరదా ఇంటర్వ్యూతో ఆటపట్టించాడు.

TNN 22 Nov 2017, 2:33 pm
కోల్‌కతాలో 8 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ నాగ్‌పూర్‌ టెస్టుకు దూరం అవుతున్నాడు. నవంబర్ 23న భువీ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. తన స్నేహితురాలు నుపుర్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వీరి పెళ్లి జరగనుంది. తర్వాత వధువు ఇంట్లో, నవంబర్ 30న దేశ రాజధానిలో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నాడు. ఢిల్లీలో భువీ ఇచ్చే పార్టీలో టీమిండియా క్రికెటర్లు పాల్గొననున్నారు.
Samayam Telugu shikhar dhawan pulls bhuvneshwar kumars leg on getting married
భువీని ఆటపట్టిస్తూ.. ధావన్ ఇంటర్వ్యూ!


పెళ్లి కొడుకు కాబోతున్న భువనేశ్వర్ కుమార్‌తో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సరదాగా ఇంటర్వ్యూ చేసి ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. మరో సింహం రేపు బానిసగా మారబోతోంది. ప్రస్తుతం తను నా పక్కనే కూర్చున్నాడు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయ్ భువీ అని ధావన్ ప్రశ్నించాడు.


క్రికెట్ ఆడుతూ కోల్‌కతాలో ఉండిపోయిన భువీ.. తాను పెళ్లికి సన్నద్ధం కాలేదని చెప్పాడు. తయారు కావడం లేదు. నేనేం చేయడం లేదు. ఇంట్లో వాళ్లే చేస్తున్నారని భువనేశ్వర్ తెలిపాడు.

నీలా పెళ్లయిన వాళ్లను అడిగి వాళ్ల అనుభవాలను తెలుసుకుంటున్నా అని భువీ ధావన్‌కు రిటర్న్ పంచ్ ఇచ్చాడు. కాబోయే భార్య పట్ల పొసెసివ్‌గా ఉన్నట్టున్నావ్ అని ధావన్ అడిగితే.. అలాంటిదేం లేదు. తను నా ప్రేమ అని బదులిచ్చాడు. ఈ తతంగం మొత్తాన్ని ధావన్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.