యాప్నగరం

నా వేతనం 1300% పెరగడానికి కారణమదే: ధావన్

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నా వేతనం 1300 శాతం పెరగనుంది. బీసీసీఐ టాప్ గ్రేడ్‌లో నేను చోటు దక్కించుకోవడానికి మూడు ఫార్మాట్లలో రాణించడమే కారణం - ధావన్.

Samayam Telugu 24 Mar 2018, 12:17 pm
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో శిఖర్ ధావన్‌కు ఏ+ గ్రేడ్ లభించింది. దీంతో టాప్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతోపాటు అతడు ఏడాదికి రూ. 7 కోట్లు పారితోషకంగా అందుకోనున్నాడు. గత ఏడాది గ్రేడ్-సిలో ఉన్న ధావన్.. అద్భుతమైన ఆటతీరు కనబర్చడంతో ఈ సంవత్సరం టాప్ గ్రేడ్‌‌లో నిలిచాడు. అత్యుత్తమైన ఐదుగురు ఆటగాళ్లలో ఒకడిగా చోటు దక్కించుకోవడం వల్ల గబ్బర్ వార్షిక కాంట్రాక్ట్‌లో 1300 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.
Samayam Telugu shikhar dhawan reacts on getting 1300 pay hike in bccis central contracts
నా వేతనం 1300% పెరగడానికి కారణమదే: ధావన్


టాప్ గ్రేడ్‌లో చోటు దక్కడం పట్ల ధావన్ సంతోషంగా వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణించడం.. ఏ+ గ్రేడ్‌లో చోటు దక్కించుకోవడానికి ఉపకరించిందని చెప్పాడు. ‘గత సీజన్లో చక్కగా ఆడాను. భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో రాణించాను. అందుకే నన్ను బీసీసీఐ గ్రేడ్-సి నుంచి ఏ+ గ్రేడ్‌కి ప్రమోట్ చేసింద’ని ధావన్ చెప్పాడు.

దక్షిణాఫ్రికాలో అద్భుతమైన క్రికెట్ ఆడాం. టెస్టుల్లో ఓడినప్పటికీ.. వన్డే, టీ20 సిరీస్‌లు గెలుపొందాం. గతంలో ఏ భారత జట్టుకు ఇది సాధ్యం కాలేదు. మేం విజయం సాధంచినందుకు గర్వంగా ఉందని గబ్బర్ తెలిపాడు. ఐపీఎల్ తర్వాత అప్ఘాన్‌తో టెస్టు ఉంది. తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలి. ఇంగ్లిష్ జట్టుతో పోటీకి సరిగా సన్నద్ధం కావడానికి బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ధావన్ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.