యాప్నగరం

టీమిండియాలో ఎవర్ని ఆడిస్తారో తెలియందంటున్న ఓపెనర్ (వీడియో)

తనకు లభించిన రెండు అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నానని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. అయితే జట్టు సెలెక్షన్ గురించి తాను ఆలోచించడం లేదని, అది తనకు సంబంధించిన విషయం కాదని తెలిపాడు.

Samayam Telugu 11 Jan 2020, 4:46 pm
భారతజట్టు సెలెక్షన్ ప్రక్రియపై ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. శుక్రవారం పుణేలో జరిగిన మూడో టీ20లో శ్రీలంకపై 78 పరుగులతో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. గువాహటిలో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దుకాగా.. ఇండోర్ ‌టీ20లో భారత్ నెగ్గిన సంగతి తెలిసిందే. పుణే మ్యాచ్ ముగిశాక ధావన్ విలేకరులతో మాట్లాడుతూ భారత టాపార్డర్ బాగా ఆడుతుందని కితాబిచ్చాడు.
Samayam Telugu shikhar dhawan says he has no idea about selection
టీమిండియాలో ఎవర్ని ఆడిస్తారో తెలియందంటున్న ఓపెనర్ (వీడియో)




Read Also : కేఎల్ రాహుల్ క్రీజు వదిలితే ఎలా..? స్టంపౌట్
లిమిటెడ్ ఓవర్లలో ముగ్గురు ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, తాను బాగా ఆడుతున్నామని, జట్టు సెలెక్షన్ ప్రక్రియ గురించి తాను ఆలోచించడం లేదని తెలిపాడు. గతేడాది రోహిత్ అదరగొట్టాడని ధావన్ గుర్తు చేశాడు. వన్డే ప్రపంచకప్, తర్వాత సిరీస్‌లలో హిట్‌మ్యాన్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మరో ఓపెనర్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. స్థిరమైన ఆటతో తను ఫస్ట్ చాయిస్ ఓపెనర్ ఎదిగాడు. తాజాగా పుణే మ్యాచ్‌లో ధావన్‌ కూడా అర్ధసెంచరీ చేయడంతో ఓపెనర్ల ఎంపికై మల్లగుల్లాలు పడుతున్నారు.

Read Also : ఏం యార్కర్ షైనీ..? లంక బ్యాట్స్‌మెన్ షాక్
అయితే సెలెక్షన్ వ్యవహరాలు తన చేతిలో లేవని ధావన్ చెప్పుకొచ్చాడు. తనకు లభించిన రెండు అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నానని తెలిపాడు. గతేడాది ఫామ్ కోల్పోయి, గాయల బారిన పడిన ధావన్ సరిగా రాణించలేకపోయాడు. నిజానికి లంకతో రెండో టీ20లో నెమ్మదైన బ్యాటింగ్‌తో విసిగించాడు. ఇక పుణే మ్యాచ్‌లో పాత ధావన్ గుర్తుకు తెచ్చేలా ఆడాడు. అంతకుముందు ధావన్‌ను టీ20ల నుంచి తప్పించాలని డిమాండ్లు కూడా వచ్చాయి. వచ్చేవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ ఈ ముగ్గురిలో ఎవరిని ఎంపిక చేయనున్నారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్‌కు తోడుగా రాహుల్ ఆడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Read Also : కోహ్లీ రనౌట్ వెనుక ఓవర్ కాన్ఫిడెన్స్.. మనీశ్ పాండే తప్పెంత..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.