యాప్నగరం

కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్

కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్‌మెన్.

TNN 6 Nov 2017, 4:55 pm
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా ఓ రేంజ్‌లో చెలరేగిపోయే కోహ్లి.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా దీటుగా ఎదుర్కొనే విరాట్.. ఈ మధ్య పాకిస్థానీ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌పై ప్రశంసలు గుప్పించాడు. ‘‘నేనెప్పుడూ అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. అతడు బలంగా విసిరిన బంతి బ్యాట్స్‌మెన్ శరీరాన్ని తాకుతుందేమో అనిపిస్తుంది. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చాలా ప్రమాదకారి. షోయబ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉండటం ఉత్తమం.’’ అని ప్రపంచంలోని ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన షోయబ్‌ను ఉద్దేశించి కోహ్లి చెప్పాడు.
Samayam Telugu shoaib akhtar reply to virat kohlis praise
కోహ్లికి బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది: అక్తర్


విరాట్ వ్యాఖ్యల పట్ల అక్తర్ స్పందించాడు. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పు బౌలింగ్ చేయకపోవడం మంచిదైంది. అతడో గొప్ప బ్యాట్స్‌మెన్. అతడికి బౌలింగ్ వేయడం కచ్చితంగా గొప్ప పోటీ అని ట్వీట్ చేశాడు.

I was better off not bowling at all when #Kohli was batting.Jokes apart,he's a gr8 batsman & bowling agnst him wud have been a gr8 contest. pic.twitter.com/EHL32UpXrU — Shoaib Akhtar (@shoaib100mph) November 4, 2017
2010 ఆసియా కప్‌లో భాగంగా దంబుల్లా స్టేడియంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో అక్తర్ స్పెల్ అయిపోయాక విరాట్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 27 బంతుల్లో 18 పరుగులు చేసిన సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కొనే అవకాశం కోహ్లికి దక్కలేదు.

పెప్సీ కప్‌లో భాగంగా భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరిగిన మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ విసిరిన బంతి గంగూలీ ఛాతి భాగంలో బలంగా తాకింది. దీంతో సౌరభ్ కింద పడిపోయి, బాధతో విలవిల్లాడు. నొప్పి తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.