యాప్నగరం

పాక్‌కు 2019 వరల్డ్‌ కప్‌ అందించి రిటైర్మెంట్..!

ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచకప్ అనంతరం వన్డే క్రికెట్‌ నుంచి తాను తప్పుకుంటానని పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్

Samayam Telugu 26 Jun 2018, 4:48 pm
ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచకప్ అనంతరం వన్డే క్రికెట్‌ నుంచి తాను తప్పుకుంటానని పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ప్రకటించాడు. త్వరలో జింబాబ్వే పర్యటనకి వెళ్లనున్న పాకిస్థాన్ జట్టులోకి ఎంపికైన షోయబ్.. తన భవిష్యత్ కార్యచరణ గురించి మీడియాతో మంగళవారం మాట్లాడాడు. వన్డేల నుంచి తప్పుకున్న తర్వాత ఫిట్‌నెస్‌ ఉంటే టీ20లు ఆడేందుకు ప్రయత్నిస్తానని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వివరించాడు.
Samayam Telugu malik-m


1999లో వెస్టిండీస్‌‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మాలిక్.. కెరీర్‌లో 261 వన్డేలాడి మొత్తం 6,975 పరుగులు చేశాడు. ఇందులో 9 శతకాలు, 41 అర్ధ శతకాలున్నాయి. 2015లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్.. ఆ తర్వాత వన్డే, టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.

‘2019 ప్రపంచకప్‌ నా కెరీర్‌లో ఆడే చివరి వన్డే సిరీస్. ఆ తర్వాత ఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటే టీ20లు ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇప్పటికే 2009లో టీ20 ప్రపంచకప్, 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో నేనున్నాను. ఇక ప్రపంచకప్‌ మాత్రమే నా కెరీర్‌లో మిగిలి ఉంది. అందుకే 2019 ప్రపంచకప్ గెలవడమే నా తదుపరి లక్ష్యం’ అని షోయబ్ మాలిక్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.