యాప్నగరం

India Playing XI: పాక్‌తో మ్యాచ్‌లో కాంబినేషన్ కోసం ఆ ఇద్దరిపై వేటు? తుది జట్టు ఇలా

IND vs PAK Match కోసం తుది జట్టు ఎంపిక భారత కెప్టెన్ రోహిత్ శర్మకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. దుబాయ్ పిచ్ స్పిన్‌కి అనుకూలంగా కనిపిస్తోంది. దాంతో ముగ్గురు స్పిన్నర్లని ఆడించాలంటే..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 28 Aug 2022, 12:42 pm

ప్రధానాంశాలు:

  • భారత్, పాకిస్థాన్ మధ్య ఈరోజు మ్యాచ్
  • రాత్రి 7:30 గంటలకి దుబాయ్‌లో గేమ్
  • భారత తుది జట్టుపై ఇంకారాని క్లారిటీ
  • ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌కి రోహిత్ మొగ్గు?
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India vs pakistan
India vs pakistan asia cup: పాకిస్థాన్‌తో ఈరోజు జరగనున్న ఆసియా కప్ మ్యాచ్‌కి భారత్ తుది జట్టుపై ఉత్కంఠ నెలకొంది. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 7:30 గంటలకి మ్యాచ్ జరగనుండగా.. తుది జట్టు ఇంకా క్లారిటీ రావడం లేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్‌లో పాకిస్థాన్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు బాహాటంగా ప్రకటించాడు. దాంతో తుది జట్టు కూడా కొత్తగా ఉండబోతోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అలానే ప్రయోగాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని హిట్‌మ్యాన్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌కి భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేందర్ చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.

ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్ల కాంబినేషన్‌తో భారత్ తుది జట్టుని రోహిత్ శర్మ ఎంచుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవర్ ప్లేలో భువీ, అర్షదీప్ సింగ్, అశ్విన్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటే మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాతో కలిసి చాహల్ బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అలానే బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ నెం.7 వరకూ బ్యాటర్లు ఉండనున్నారు. దుబాయ్ పిచ్ స్పిన్‌కి అనుకూలమని శనివారం రాత్రి శ్రీలంక, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌తో తేలిపోయింది. దాంతో ముగ్గురు స్పిన్నర్లు జట్టులో ఉండటం దాదాపు లాంఛనమే. దాంతో దీపక్ హుడా, దినేశ్ కార్తీక్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.