యాప్నగరం

ప్రపంచకప్‌లో గిల్ ఆడటం కష్టమే..!: దేశ్‌గుప్త

శుభమన్‌ గిల్ చాలా ఆలస్యంగా పోటీలోకి వచ్చాడు. ఇప్పటికే టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టులో ఎవరెవరు..? ఉండాలి అనేదానిపై దాదాపు ఓ అవగాహనకి వచ్చేసింది. - దీప్ దేశ్‌గుప్త

Samayam Telugu 2 Feb 2019, 7:29 pm
ఇంగ్లాండ్ వేదికగా మే నెల ఆఖరి వారంలో ఆరంభంకానున్న వన్డే ప్రపంచకప్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ శుభమన్ గిల్ ఆడటం కష్టమేనని మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్త అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో హామిల్టన్ వేదికగా గురువారం ముగిసిన మూడో వన్డేతో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన శుభమన్ గిల్ 21 బంతులు ఎదుర్కొని 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటయ్యాడు. ప్రపంచకప్ నేపథ్యంలో కివీస్‌తో 4, 5వ వన్డేల నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. ఆ స్థానంలో తుది జట్టులోకి గిల్ వచ్చాడు. కానీ.. మొదటి వన్డేలోనే నిరాశపరిచాడు.
Samayam Telugu shubman-gill-pti-1540469356


ప్రపంచకప్ ప్రణాళికల గురించి తాజాగా దేశ్‌గుప్త మాట్లాడుతూ ‘శుభమన్‌ గిల్ చాలా ఆలస్యంగా పోటీలోకి వచ్చాడు. ఇప్పటికే టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టులో ఎవరెవరు..? ఉండాలి అనేదానిపై దాదాపు ఓ అవగాహనకి వచ్చేసింది. ఒకవేళ అతను రేస్‌లో నిలవాలనుకుంటే మాత్రం ప్రపంచకప్‌లోపు తగినన్ని అవకాశాల్ని అందిపుచ్చుకుని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి’ అని దేశ్‌గుప్త సూచించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.