యాప్నగరం

విరాట్ కోహ్లీ.. జట్టులో కృనాల్‌కి ఛాన్సివ్వు..!

ఇంగ్లాండ్‌తో మంగళవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య‌కి భారత తుది జట్టులో చోటిస్తే మేలని మాజీ క్రికెటర్ వీవీఎస్

Samayam Telugu 3 Jul 2018, 12:08 pm
ఇంగ్లాండ్‌తో మంగళవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య‌కి భారత తుది జట్టులో చోటిస్తే మేలని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. మాంచెస్టర్ వేదికగా ఈరోజు రాత్రి 10 గంటలకి తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో రెండు రోజుల క్రితం కృనాల్ పాండ్య‌‌కి సెలక్టర్లు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. బలమైన ఇంగ్లాండ్‌‌కి గట్టి పోటీనివ్వాలంటే.. జట్టులో ఆరో బౌలర్‌ కూడా ఉంటే బాగుంటుందని వీవీఎస్ అభిప్రాయపడ్డారు.
Samayam Telugu sixth specialist bowling option is ideal for india vvs laxman
విరాట్ కోహ్లీ.. జట్టులో కృనాల్‌కి ఛాన్సివ్వు..!


సాధారణంగా టీ20ల్లో భారత జట్టు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంటోంది. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కి జట్టుని అంచనా వేస్తే భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్‌తో బౌలింగ్ విభాగం ఉండొచ్చు. కానీ.. ఇక్కడ అదనపు బౌలర్‌ రూపంలో కృనాల్ పాండ్య‌ని తీసుకోవాలని లక్ష్మణ్ సూచిస్తున్నాడు.

‘ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఆడటంలో కొంచెం తడబడుతుంటారు. దానికి తోడు అక్కడి పిచ్‌, వాతావరణం స్పిన్నర్లకి అనుకూలిస్తాయి. అందుకే కృనాల్ పాండ్య‌‌ాని జట్టులో తీసుకుంటే మేలని నాకు అనిపిస్తోంది. అతని రాకతో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా బలోపేతం అవుతుంది. కృనాల్ పాండ్య‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ నెమ్మదించి.. క్రమంగా ఒత్తిడితో వికెట్ చేజార్చుకుంటారని’ అని లక్ష్మణ్ వివరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.