యాప్నగరం

శ్రీలంకలో దక్షిణాఫ్రికా టీమ్ పర్యటన వాయిదా

కరోనా వైరస్ కారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలోనే కాదు.. జూన్‌లో జరగాల్సిన క్రికెట్ సిరీస్‌లు కూడా వాయిదా పడుతున్నాయి. ఈ వైరస్ ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో ఎవరికీ స్పష్టత లేకపోవడంతో వాయిదాతో క్రికెట్ బోర్డులు సరిపెడుతున్నాయి.

Samayam Telugu 20 Apr 2020, 8:21 pm
కరోనా వైరస్‌తో క్రికెట్ సిరీస్‌ల వాయిదా కొనసాగుతోంది. ఇప్పటికే మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేయగా.. జూన్ ఆరంభంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌ కూడా తాజాగా వాయిదాపడింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఈరోజు ఓ ప్రకటనని విడుదల చేసింది.
Samayam Telugu SL VS SA 2020


Read More: టీ20ల్లో 14 ఏళ్లుగా ధోనీ ఖాతాలో చెత్త రికార్డ్

శ్రీలంకలో పర్యటించనున్న దక్షిణాఫ్రికా ఆ జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ.. కరోనా వైరస్ అప్పటిలోపు పూర్తిగా నియంత్రణలోకి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఆ టూర్‌ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. మార్చి నెలలో భారత్ పర్యటనకి వచ్చిన దక్షిణాఫ్రికా టీమ్.. కరోనా వైరస్ కారణంగా సిరీస్ మధ్యలోనే రద్దవడంతో క్లిష్ట పరిస్థితుల నడుమ స్వదేశానికి వెళ్లి అక్కడ 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండిన విషయం తెలిసిందే.

Read More: 6, 6, 6, 6, 6, 6.. కారణం ఫ్లింటాఫ్ బెదిరింపులే: యువరాజ్

‘‘శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ వాయిదా పడటం బాధిస్తోంది. కానీ.. తప్పడం లేదు. పరిస్థితులు చక్కబడిన తర్వాత సిరీస్ రీషెడ్యూల్ వెల్లడిస్తాం. దేశంలో లాక్‌డౌన్ కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా పూర్తి స్థాయిలో సిరీస్‌కి సిద్ధం కాలేకపోయారు’’ అని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్వెస్ పాల్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.