యాప్నగరం

Virat Kohli‌ కి ఆసియా కప్ 2022 ముంగిట బూస్ట్.. దాదా సపోర్ట్

Ganguly , Kohli మధ్య గత కొన్ని నెలలుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించే ముందు అతడ్ని కెప్టెన్‌గా కొనసాగమని తాను రిక్వెస్ట్ చేసినట్లు గంగూలీ తొలుత చెప్పుకొచ్చాడు. కానీ.. విరాట్ కోహ్లీ మాత్రం తనని ఎవరూ అడగలేదని బాంబ్ పేల్చాడు. దాంతో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ గురించి మీడియా ముందు నెగటివ్‌గా మాట్లాడినందుకు అతను షోకాజ్ నోటీసులు ఎదుర్కోబోతున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. ?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 16 Aug 2022, 1:11 pm

ప్రధానాంశాలు:

  • యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి ఆసియా కప్
  • గత కొన్నిరోజులుగా టీమిండియాకి కోహ్లీ దూరం
  • ఆసియా కప్‌కి కోహ్లీని ఎంపిక చేసిన భారత సెలెక్టర్లు
  • కోహ్లీ ఫామ్ అందుకుంటాడని దాదా ధీమా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sourav ganguly backs virat kohli (Pic Source: Twitter)
విరాట్ కోహ్లీ (Pic Source: Twitter)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్ 2022 (Asia Cup 2022) ముంగిట ఉత్సాహానిచ్చే వార్త. గత కొన్ని రోజులుగా పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న విరాట్ కోహ్లీ(Virat Kohli)కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మద్దతుగా నిలిచాడు. యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ 2022 ప్రారంభంకానుండగా.. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత హాలిడే‌కి వెళ్లి కోహ్లీ ఈ మెగా టోర్నీతో జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ 2022 కూడా జరగనుండటంతో విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవడం ఇప్పుడు టీమిండియాకి అవసరం.
విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య గత ఏడాది డిసెంబరు నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఆ తర్వాత కొన్ని రోజులకే వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా కోహ్లీని తప్పించారు. ఆ సమయంలో కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగమని తాను రిక్వెస్ట్ చేసినట్లు గంగూలీ చెప్పగా.. తనకి మాట మాత్రం కూడా చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తప్పించారని కోహ్లీ ఆరోపించాడు. దాంతో.. కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు గంగూలీ సిద్ధమైనట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసింది కూడా చాలా తక్కువ.

విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ గురించి తాజాగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘‘కోహ్లీ‌‌ని ఫస్ట్ మ్యాచ్‌లు ఆడనివ్వండి. అతను టీమిండియాలో బిగ్ ప్లేయర్. భారత్ జట్టు తరఫున ఎన్నో పరుగులు చేశాడు. కచ్చితంగా అతను ఆసియా కప్‌లో ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నా’’ అని సౌరవ్ గంగూలీ వెల్లడించాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.