యాప్నగరం

​ బీఎ‌మ్‌డబ్ల్యూ వదిలి.. ట్యాక్సీలో గంగూలీ

లీ రోడ్డులోని ఎక్సైడ్ క్రాసింగ్ వద్ద బీఎమ్‌డబ్ల్యూ కారు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో గంగూలీ సమావేశానికి ఆలస్యం

TNN 2 Aug 2017, 2:26 pm
భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం అందర్నీ ఆశ్చర్యపరిచే రీతిలో బీసీసీఐ సమావేశానికి హాజరయ్యాడు. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. కోల్‌కతాలో జరుగుతున్న బీసీసీఐ టెక్నికల్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఉదయం తన బీఎమ్‌డబ్ల్యూ కారులో బయల్దేరాడు. అయితే.. దారి మధ్యలో అది బ్రేక్‌ డౌన్ కావడంతో గంగూలీ ఏమాత్రం ఆలోచించకుండా ట్యాక్సీని పిలిపించుకుని అందులో సమావేశానికి వెళ్లిపోయాడట.
Samayam Telugu sourav ganguly forced to take a taxi to attend bcci meeting
​ బీఎ‌మ్‌డబ్ల్యూ వదిలి.. ట్యాక్సీలో గంగూలీ


‘లీ రోడ్డులోని ఎక్సైడ్ క్రాసింగ్ వద్ద బీఎమ్‌డబ్ల్యూ కారు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో గంగూలీ సమావేశానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ట్యాక్సీలో వెళ్లిపోయారు’ అని గంగూలీ కారు డ్రైవర్ వెల్లడించాడు. సాధారణంగా అంగరక్షకుల మధ్య సకల సౌకర్యాలతో కనిపించే గంగూలీ ట్యాక్సీలో వచ్చి హోటల్ గేటు ముందు దిగి నడుచుకుంటూ లోపలికి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఇటీవలే సాధారణ ప్రయాణికుడిలా ఈ కోల్‌కతా ప్రిన్స్ రైలులో ప్రయాణం చేసిన విషయం తెలిసిందే.

The BMW broke down on Lee Road near Exide crossing. He hired a yellow taxi and rushed to the meeting," Sourav Ganguly's driver said.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.