యాప్నగరం

Diego Maradona: ‘నా హీరో ఇకలేడు.. నీ కోసమే ఫుట్‌బాల్ చూశా’.. గంగూలీ భావోద్వేగం

ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకడైన డిగో మారడోనా మరణం పట్ల సచిన్, గంగూలీ సహా క్రీడా ప్రపంచం మొత్తం సంతాపం ప్రకటించింది.

Samayam Telugu 26 Nov 2020, 8:40 am
ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడైన డిగో మారడోనా హార్ట్ ఎటాక్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. వరల్డ్ కప్ గెలిచిన మారడోనాను కొంత కాలంగా అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. ఇటీవలే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. కోలుకుంటున్న క్రమంలోనే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు.
Samayam Telugu Diego
Diego Maradona (Getty Images)


మారడోనా మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఫుట్‌బాల్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలు ఆడే కోట్లాది మందిలోనూ మారడోనా స్ఫూర్తి నింపాడు. దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడి మరణం పట్ల పలువురు భారత క్రీడాకారులు సంతాపం ప్రకటించారు.
తన అభిమాన ఆటగాడి మరణంతో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘నా హీరో ఇక లేడు. జీనియస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. నీ కోసమే నేను ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూశాను’’ అంటూ దాదా ట్వీట్ చేశాడు.
భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, భారత గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ తదితరులు మారడోనా మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.