యాప్నగరం

టీమిండియా సిరీస్ గెలుస్తుంది.. కానీ..?

ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ని టీమిండియా గెలుస్తుంది

TNN 14 Sep 2017, 2:52 pm
ఆస్ట్రేలియాతో ఆదివారం నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌ని టీమిండియా గెలుస్తుంది.. కానీ.. వారిపై క్లీన్‌స్వీప్ సాధించడం కష్టమేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ని భారత్ 5-0తో వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తరహాలోనే ఆస్ట్రేలియాని కూడా భారత్ క్లీన్‌స్వీప్ చేస్తుందంటారా..? అని ప్రశ్నించగా గంగూలీ సమాధానం చెప్పారు.
Samayam Telugu sourav ganguly team india will win but whitewash unlikely
టీమిండియా సిరీస్ గెలుస్తుంది.. కానీ..?


‘సొంతగడ్డపై భారత్‌ని ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ని టీమిండియా గెలుస్తుంది. కానీ.. 5-0తో క్లీన్‌స్వీప్ మాత్రం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఆసీస్ కూడా వన్డేల్లో బలమైన జట్టే. ప్రస్తుతం సెలక్టర్లు ప్రపంచకప్ 2019‌ని దృష్టి‌లో పెట్టుకుని యువ క్రికెటర్లకి అవకాశాలిస్తుండటం మంచిదే. ఈ దూరదృష్టి‌తో అందరికీ ఛాన్స్ దక్కుతుంది. మరోవైపు జట్టు రిజర్వ్ బెంచ్‌ కూడా బలోపేతమవుతుంది. ఫిటెనెస్, ఫామ్ అందుకోగలిగితే జట్టులోకి వచ్చేందుకు యువరాజ్‌కి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అని గంగూలీ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.