యాప్నగరం

కోహ్లి.. రెండో టెస్టుకి జట్టుని మార్చొద్దు: గంగూలీ

ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు తొలి టెస్టులో ఓడినప్పటికీ.. సిరీస్‌లో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ క్రికెటర్ సౌరవ్

Samayam Telugu 6 Aug 2018, 1:31 pm
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ జట్టు తొలి టెస్టులో ఓడినప్పటికీ.. సిరీస్‌లో పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే.. మొదటి టెస్టు ఆడిన తుది జట్టునే రెండో టెస్టులోనూ విరాట్ కోహ్లి కొనసాగిస్తేనే అది సాధ్యమవుతుందని గంగూలీ వెల్లడించాడు. బర్మింగ్‌హామ్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా.. విరాట్ కోహ్లి మినహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు విఫలమవడం, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌ పుజారాని తుది జట్టు నుంచి తప్పించి అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ని ఆడించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో.. లార్డ్స్ వేదికగా గురువారం నుంచి జరగనున్న రెండో టెస్టుకి తుది జట్టులో మార్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు. కానీ.. అలా మార్చకపోవడమే మంచిదని గంగూలీ సూచించాడు.
Samayam Telugu ..


‘జట్టులోని ఆటగాళ్లలో కెప్టెన్ ఆత్మవిశ్వాసం నింపాలి. ఎందుకంటే.. అది అతని జట్టు.. అతను మాత్రమే వారిలో స్ఫూర్తి నింపగలడు. పరాజయం ఎదురైన తర్వాత.. ఆటగాళ్లతో కలిసి కూర్చుని.. వారితో సాంత్వనంగా మాట్లాడాలి. ఒకవేళ విరాట్ కోహ్లి అలా చేయగలిగితే.. తప్పకుండా ఆటగాళ్ల ప్రదర్శన సిరీస్‌లో మెరుగవుతుంది. ఇంగ్లాండ్ గడ్డపై కుదురుకునేందుకు ఆటగాళ్లకి కొంత సమయం ఇవ్వాలి. తుది జట్టులో మార్పులు చేస్తూ ఉంటే.. ఆటగాళ్లు ఆందోళనకి గురవతారు. అలా కాకుండా.. కెప్టెన్ వారికి భరోసా ఇచ్చినప్పుడు మైదానంలో స్వేచ్ఛగా ఆడగలుగుతారు’ అని గంగూలీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.