యాప్నగరం

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ సడన్‌గా రిటైర్మెంట్.. IPLలో రూ.16.25 కోట్ల ప్లేయర్

Chris Morris: ఐపీఎల్ 2021 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధరకి అమ్ముడుపోయిన క్రిస్ మోరీస్.. ఐపీఎల్ 2022 వేలం ముంగిట సడన్‌గా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ గుడ్ బై చెప్పేశాడు.

Samayam Telugu 11 Jan 2022, 2:52 pm

ప్రధానాంశాలు:

  • దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ రిటైర్మెంట్
  • ఏడాదికాలంగా ఇంటర్నేషన‌ల్ క్రికెట్‌కి దూరం
  • ఐపీఎల్‌లో రూ. 16.25 కోట్లకి అమ్ముడుపోయిన మోరీస్
  • క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ గుడ్ బై
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chris Morris retirement (Pic Credit: Getty Images)
దక్షిణాఫ్రికా సీనియర్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ సడన్‌గా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకీ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. గత ఏడాదికాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న క్రిస్‌ మోరీస్.. ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఏకంగా 16.25 కోట్లకి క్రిస్‌ మోరీస్‌ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకి వేలంలో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా క్రిస్ మోరీస్ నిలిచాడు.
దక్షిణాఫ్రికా తరఫున 2012లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన క్రిస్ మోరీస్.. 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 774 పరుగులు చేసిన క్రిస్ మోరీస్.. 94 వికెట్లు కూడా పడగొట్టాడు. కానీ.. గాయాలు అతని కెరీర్‌ని దెబ్బతీశాయి. గంటకి సగటున 140కిమీ వేగంతో బంతులు వేసిన క్రిస్ మోరీస్.. నెం.7 లేదా నెం.8లో బ్యాటింగ్‌కి వచ్చి తన పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు ఉన్నాయి.

ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల వేలం ఫిబ్రవరిలో జరగనుండగా.. ఈసారి కూడా మోరీస్‌కి మంచి ధర దక్కేది. కానీ.. 34 ఏళ్ల మోరీస్.. రిటైర్మెంట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒక మ్యాచ్‌లో బ్యాట్‌తో.. మరో మ్యాచ్‌లో బంతితో రాజస్థాన్ రాయల్స్ జట్టు‌కి అనూహ్య విజయాల్ని ఈ ఆల్‌రౌండర్ అందించాడు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఐపీఎల్ 2020 వేలంలో క్రిస్‌ మోరీస్‌ని రూ.10 కోట్లకి కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్.. ఆ తర్వాత 2021కి వేలంలోకి వదిలేసి మళ్లీ రూ.16.25 కోట్లకి కొనుగోలు చేయడం. ఇకపై దక్షిణాఫ్రికాలోని దేశవాళీ జట్టు టైటాన్స్‌కి కోచ్‌గా ఉండనున్నట్లు క్రిస్ మోరీస్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.