యాప్నగరం

4 రోజుల టెస్టు రెండు రోజుల్లోనే..!

ఐసీసీ ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు రోజుల టెస్టు ఆదిలోనే ఉసూరమనిపించింది. సుదీర్ఘ ఫార్మాట్‌పై అభిమానులకి ఆసక్తి పెంచేందుకు

TNN 28 Dec 2017, 9:42 am
ఐసీసీ ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు రోజుల టెస్టు ఆదిలోనే ఉసూరమనిపించింది. సుదీర్ఘ ఫార్మాట్‌పై అభిమానులకి ఆసక్తి పెంచేందుకు ఐదు రోజుల టెస్టుని నాలుగు రోజులకి కుదిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచనతో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య కేప్‌టౌన్ వేదికగా ఐసీసీ ఈ మ్యాచ్‌ని నిర్వహించింది. కానీ.. సఫారీ బౌలర్ల ధాటికి తేలిపోయిన జింబాబ్వే ఇన్నింగ్స్‌, 120 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూస్తూ రెండు రోజులకే మ్యాచ్‌ ముగిసేలా చేసింది. ఈ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu south africa crush zimbabwe by an innings and 120 runs
4 రోజుల టెస్టు రెండు రోజుల్లోనే..!


మంగళవారం ఆరంభమైన ఈ టెస్టు‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 78.3 ఓవర్లలో 309/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. ఆ జట్టులో మర్ర్కమ్‌ (125: 204 బంతుల్లో 14x4, 2x6), కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (53: 65 బంతుల్లో 5x4, 1x6) రాణించారు. తొలి రోజు చివరి సెషన్‌లో ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా.. ఆ రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వేని 30/4తో ఒత్తిడిలో పడేసింది. రెండో రోజైన బుధవారం సఫారీ బౌలర్ మోర్నీ మోర్కెల్‌ (5/21) నిప్పులు చెరగడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ 30.1 ఓవర్లలో 68 పరుగులకే ముగిసింది. అనంతరం ఫాలో ఆన్ ఆడిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ కేశవ్‌ మహరాజ్‌ (5/59), ఫెహ్లుక్వాయో (3/13) ధాటికి 42.3 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. జనవరి 5 నుంచి భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.