యాప్నగరం

లార్డ్స్ ఓటమి ఎఫెక్ట్.. జేపీ డుమినిపై వేటు

మార్క్‌వుడ్ వేసిన బౌన్సర్‌ బంతిని పేలవంగా మిడ్‌ వికెట్‌లో గాల్లోకి లేపేసిన జేపీ డుమిని‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి.

TNN 13 Jul 2017, 8:16 pm
ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 211 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా దిద్దుబాటు చర్యలకు దిగింది. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జేపీ డుమిని తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి చేసింది 17 పరుగులే. దీంతో అతనిపై రెండో టెస్టులో వేటు పడబోతోందని వార్తలు వస్తున్నాయి. మార్క్‌వుడ్ వేసిన బౌన్సర్‌ బంతిని పేలవంగా మిడ్‌ వికెట్‌లో గాల్లోకి లేపేసిన జేపీ డుమిని‌పై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
Samayam Telugu south africa drop duminy for second test
లార్డ్స్ ఓటమి ఎఫెక్ట్.. జేపీ డుమినిపై వేటు


రెగ్యులర్ టెస్టు జట్టు కెప్టెన్ డుప్లెసిస్ తన భార్య ఇటీవల ప్రసవించడంతో తొలి టెస్టుకి దూరంగా ఉన్నాడు. తాజాగా జేపీ డుమిని స్థానాన్ని డుప్లెసిస్ భర్తీ చేస్తాడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. మరోవైపు బెన్‌స్టోక్స్‌ని ఔట్ చేసిన సమయంలో మితిమీరి సంబరాలు చేసుకున్న ఫాస్ట్ బౌలర్‌ రబాడపై రెండో టెస్టుకి వేటు పడిన విషయం తెలిసిందే. అతని స్థానంలో క్రిస్ మోరీస్, ఆండీలే, ఓలివియర్‌‌ త్రయం నుంచి ఒక్కరికి చోటు దక్కనుంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు ఆరంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.