యాప్నగరం

దక్షిణాఫ్రికాకు kolpak దెబ్బ.. మరో క్రికెటర్ రిటైర్మెంట్

అమెరికాలో ఆడటం కోసం 30 ఏళ్ల డేన్ పియట్ తాజాగా దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రొటీస్ త‌ర‌పున అతను తొమ్మిది టెస్టులు ఆడాడు. 26 వికెట్లు తీశాడు.

Samayam Telugu 28 Mar 2020, 4:14 pm
దక్షిణాఫ్రికా క్రికెట్ ను కోల్పాక్ డీల్‌ దెబ్బతీసిన సంగతి తెలిసింది. దీని కారణంగా ఇప్పటికే ఎంతోమంది నాణ్యమైన ప్లేయర్లు విదేశాలకు తరలి వెళ్లారు. కైలీ అబౌట్, మోర్నీ మోర్కెల్,రిలీ రొసౌ, వెర్నన్ ఫిలాండర్ లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ సౌతాఫ్రికా జట్టు నుంచి నిష్క్రమించారు. తాజాగా ఈ డీల్ కారణంగా మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. డేన్ పియ‌ట్‌ తాజాగా అమెరికా జట్టుకు ఆడాలని నిశ్చయించుకుని.. ప్రొటీస్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. ఇతను జాతీయ జట్టు తరఫున 9 టెస్టులు ఆడాడు. ఇరవై ఆరు వికెట్లు తీశాడు.
Samayam Telugu Visakhapatnam: South African player Dane Piedt raises his bat after scoring a ha...
South African player Dane Piedt


Read Also: క‌రోనా వైరస్‌పై బ్రావో సాంగ్.. నెటిజన్ల ఫిదా

తాజాగా సోషల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పియ‌ట్‌ ప్రకటించాడు. తాను అమెరికాకు వెళ్లి, అక్కడ క్రికెట్ ఆడతానని, అలాగే జాతీయ జట్టు తరపున ఆడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. త్వరలోనే తన అక్కడ జ‌రిగే మైనర్ లీగ్‌లో ఆడ‌నున్నట్లు పేర్కొన్నాడు. ఇంతకీ సౌత్ ఆఫ్రికా క్రికెట్‌ను అతలాకుతలం చేస్తున్న,కోల్పాక్ డీల్ వివ‌రాలు...జాతీయ జట్టుకు ఆడమ‌ని పేర్కొంటూ, కౌంటీ క్రికెట్లో ఆడేందుకుగానీ, ఇతర దేశాలకు వలస వెళ్లడాన్నిగానీ కోల్పాక్ డీల్‌ అంటారు. సాధారణంగా ఇంగ్లాండ్ లో ఆడడం కోసం చాలామంది ఈ డీల్‌ ద్వారా వెళతారు. వీళ్లను కోల్పాక్ ప్లేయ‌ర్లు అని అంటారు.



Read Also: భారత క్రికెటర్లకి ఈ బ్రేక్ మంచిదే: రవిశాస్త్రి

ఇంగ్లాండ్ కౌంటీలో నాలుగేళ్లు ఆడిన తర్వాత, అక్క‌డి జాతీయ జట్టు పాల్గొనేందుకు వీళ్ల‌కు అవకాశం వస్తుంది. సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గ‌తంలో కోల్పాక్ ప్లేయ‌ర్‌గా వ్యవహరించాడు. మరిన్ని మెరుగైన అవకాశాల కోసమే విదేశాలకు.. ఈ డీల్ ద్వారా క్రికెటర్లు వలస వెళ్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా కోల్పాక్ డీల్‌ వల్ల చాలా స‌ఫారీ టీమ్ నష్టపోయింది. అనేకమంది నాణ్యమైన ప్లేయర్ల సేవలను కోల్పోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.