యాప్నగరం

తొలిటెస్టు మూడో రోజు పూర్తిగా వర్షార్పణం

భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచి

TNN 7 Jan 2018, 7:34 pm
భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆదివారం ఉదయం నుంచి స్టేడియం పరిసరాల్లో భారీగా వర్షం కురుస్తుండటంతో మైదానాన్ని కవర్లతో సిబ్బంది కప్పి ఉంచారు. అయితే.. మధ్యాహ్నం వేళ కాసేపు వర్షం తగ్గుముఖం పట్టినా.. ఆటగాళ్లు మ్యాచ్‌కి సిద్ధమయ్యేలోపే మళ్లీ వర్షం మొదలవడంతో ఇక ఆట కొనసాగే అవకాశం లేనందున అంపైర్లు మూడో రోజు ఆటని ఒక బంతి కూడా పడకుండానే రద్దు చేశారు.
Samayam Telugu south africa vs india rain frustrates as play is called off without a ball being bowled
తొలిటెస్టు మూడో రోజు పూర్తిగా వర్షార్పణం


శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకి ఆలౌటవగా.. భారత్ 209 పరుగులే చేయగలిగింది. దీంతో 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని.. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 65/2తో నిలిచింది. ఆట ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఫలితం తేలడం కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 142 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ జట్టు కనీసం 300పైచిలుకు లక్ష్యాన్ని భారత్‌కి నిర్దేశించాలని యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.