యాప్నగరం

​ కోహ్లిసేన హ్యాట్రిక్ కొడితే.. చరిత్రే..!

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్న భారత్ జట్టు వన్డే సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మణికట్టు

TNN 6 Feb 2018, 5:21 pm
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చుకున్న భారత్ జట్టు వన్డే సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ సఫారీ బ్యాట్స్‌మెన్‌ని ముప్పు తిప్పలు పెడుతుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో తాజాగా జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచిన భారత్ జట్టు కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికాని ఢీకొట్టనుంది. ఈ వన్డేలో కోహ్లిసేన గెలిస్తే.. అది సఫారీ గడ్డపై సరికొత్త చరిత్రకి నాంది పలకనుంది.
Samayam Telugu south africa vs india visitors eye unprecedented hat trick against depleted proteas
​ కోహ్లిసేన హ్యాట్రిక్ కొడితే.. చరిత్రే..!


దక్షిణాఫ్రికాలో జరిగిన ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ భారత్ జట్టు ఇప్పటి వరకు రెండు వన్డేల కంటే ఎక్కువ గెలవలేదు. 1992-93‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు వన్డేల సిరీస్‌ జరగగా.. టీమిండియా రెండు వన్డేలు మాత్రమే గెలిచింది. 2010-11 పర్యటనలోనూ ఇదే ఫలితం పునరావృత‌మైంది. దీంతో దశాబ్దాల రికార్డుని తిరగరాసే సువర్ణావకాశం ఇప్పుడు కోహ్లిసేన ముందు నిలిచింది. గాయం కారణంగా డివిలియర్స్, డుప్లెసిస్, డికాక్ జట్టుకి దూరవమడం కూడా భారత్ జట్టుకి కలిసొచ్చే అంశం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.