యాప్నగరం

ఈడెన్‌లో లంక కెప్టెన్ అనూహ్య నిర్ణయం!

వర్షం ఆటంకంగా మారడంతో.. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆలస్యంగా ప్రారంభమైంది.

TNN 16 Nov 2017, 1:17 pm
వర్షం ఆటంకం కలిగించడంతో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు టాస్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చివరి 16 టెస్టుల్లో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించలేదు. చివరి సారిగా 1987లో పాకిస్థాన్ జట్టు ఇక్కడ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై పచ్చిక ఉండటం, వర్షం కారణంగా తేమ ఉండటంతో లంక కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపాడు.
Samayam Telugu sri lanka captain dinesh chandimal wins toss opts to field at eden gardens
ఈడెన్‌లో లంక కెప్టెన్ అనూహ్య నిర్ణయం!


వర్షం కారణంగా మ్యచ్ ప్రారంభం కావడం ఆలస్యం కావడంతో గురువారం గరిష్టంగా 55 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయ్యే అవకాశం ఉంది. భారత జట్టు ముగ్గురు పేసర్లు.. భువనేశ్వర్ కుమార్, షమీ, ఉమేశ్ యాదవ్‌లకు తుది జట్టులో చోటిచ్చింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ఈ మ్యాచ్‌లో బరిలో దిగుతున్నారు.

భారత జట్టు: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, సాహా, జడేజా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.