యాప్నగరం

సూపర్ శ్రీలంక.. పాక్‌‌పై సిరీస్ విజయం

గత నెలలో సొంత గడ్డ మీద భారత్ చేతిలో వైట్ వాష్‌కు గురైన లంక క్రికెట్ జట్టు యూఏఈలో అద్భుతం చేసింది.

TNN 10 Oct 2017, 6:07 pm
దుబాయ్ వేదిక పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. తొలి టెస్టులో 21 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న లంక.. రెండో టెస్టులో 68 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2010 తర్వాత యూఏఈలో పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్ నెగ్గిన తొలి జట్టుగా లంక రికార్డులు తిరగరాసింది. గత సిరీస్‌లో భారత్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన లంక అద్భుతంగా పుంజుకొని పాక్‌ను మట్టి కరిపించడం విశేషం.
Samayam Telugu sri lanka clinch series against pakistan
సూపర్ శ్రీలంక.. పాక్‌‌పై సిరీస్ విజయం


దుబాయ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 482 పరుగులు చేసిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగులకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైన పాక్.. చివరి ఇన్నింగ్స్‌లోనూ 248 రన్స్‌కే ఆలౌటయ్యింది. సెంచరీ చేసిన అసద్ షకీఫ్ డ్రాతో జట్టును గట్టెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. లంక బౌలర్ పెరీరా చివరి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్న దిముత్ కరుణ రత్నేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి.


సిరీస్ విజయంతో శ్రీలంక జట్టు తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి ఎగబాకగా.. పాకిస్థాన్ ఏడో స్థానానికి పడిపోయింది. ఏడాది క్రితం అక్టోబర్ 11న భారత్‌కు టెస్టుల్లో అగ్రస్థానాన్ని కోల్పోయిన పాక్.. తాజాగా ఏడోస్థానానికి దిగజారడం గమనార్హం. టీమిండియా 125 పాయింట్లతో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.