యాప్నగరం

భారత్‌పై ఐసీసీకి శ్రీలంక ఫిర్యాదు

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నా తమ జట్టు క్రికెటర్లని భారత్ బలవంతంగా టెస్టు మ్యాచ్‌ ఆడించిందని ఆరోపిస్తూ

TNN 7 Dec 2017, 11:08 am
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నా తమ జట్టు క్రికెటర్లని భారత్ బలవంతంగా టెస్టు మ్యాచ్‌ ఆడించిందని ఆరోపిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు తాజాగా చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్, శ్రీలంక మధ్య బుధవారం మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ నాలుగో రోజైన మంగళవారం శ్రీలంకకి చెందిన నలుగురు క్రికెటర్లతో పాటు భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా కాలుష్యం కారణంగా మైదానంలోనే వాంతులు చేసుకున్నాడు.
Samayam Telugu sri lanka lodges complaint with icc after smoggy test against india
భారత్‌పై ఐసీసీకి శ్రీలంక ఫిర్యాదు


శ్రీలంక ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చినా.. ఎలాంటి చర్యలు తీసుకోనుందో మాత్రం స్పష్టం చేయలేదు. కాలుష్యంతో పాటు.. మంగళవారం వెలుతురు తక్కువగా ఉన్నా ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ని కొనసాగించారని కూడా ఐసీసీకిచ్చిన ఫిర్యాదులో లంక బోర్డు పేర్కొంది. ఢిల్లీ లాంటి వాతావరణంలో లంక క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడటం కష్టమేనని ఆ దేశ క్రీడల మంత్రి దయసిరి జయశేఖర స్పష్టం చేశారు. మూడు టెస్టుల ఈ సిరీస్‌ని భారత్ 1-0తో దక్కించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.