యాప్నగరం

ధోనీ.. నిన్ను హీరోని చేసిన శ్రీలంకే మళ్లీ..?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. తన ఫామ్‌పై విమర్శలు చెలరేగిన ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్తూ

TNN 19 Aug 2017, 1:31 pm
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.. తన ఫామ్‌పై విమర్శలు చెలరేగిన ప్రతిసారి బ్యాట్‌తో సమాధానం చెప్తూ ముందుకు వెళ్తున్నాడు. కానీ.. ఒకప్పటితో పోలిస్తే మ్యాచ్‌ని ఫినిష్ చేయడం, వేగంగా పరుగులు రాబట్టడంలో ధోనీ దూకుడు బాగా తగ్గిపోయిందని అతని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. 2016 ఆరంభం నుంచి ధోనీ కేవలం ఐదు సార్లు మాత్రమే 50+ స్కోరు చేయడమే దీనికి నిదర్శనం. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ధోనీ చేసిన అతి నెమ్మది అర్ధశతకం చర్చనీయాంశంగా మారింది. గత 16 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో అంతటి నెమ్మది హాఫ్ సెంచరీ ఏ బ్యాట్స్‌మెన్ చేయలేదు.
Samayam Telugu sri lanka offers perfect chance for ms dhoni to shine
ధోనీ.. నిన్ను హీరోని చేసిన శ్రీలంకే మళ్లీ..?


2019 ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌కి యువ బ్యాట్స్‌మెన్/ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌కు సెలక్టర్లు అవకాశం ఇస్తారేమోనని అంతా భావించారు. కానీ.. యువరాజ్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధోనీపై నమ్మకం ఉంచారు. దీంతో సర్వత్రా విమర్శలు చెలరేగాయి. అయితే.. ధోనీ వర్జినల్ ఆటని ఈ పర్యటనలో మీరే చూస్తారని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ఎంపికపై ధీమా వ్యక్తం చేశారు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై అజేయ ఇన్నింగ్స్‌తో 28 ఏళ్ల తర్వాత భారత్‌కి ప్రపంచకప్ అందించి హీరోగా మారిన ధోనీ.. మళ్లీ అదే జట్టుపై తన స్టామినాని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవైపు జట్టులో పోటీ.. మరోవైపు విమర్శకుల వాగ్భాణాలకి సమాధానం చెప్పాలంటే ధోనీ ఈ పర్యటనలో బ్యాట్‌ ఝళిపించాల్సిందే. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకి తొలి వన్డే ప్రారంభంకానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.