యాప్నగరం

ఇంగ్లాండ్‌ని ఆఖరి వన్డేలో ఉతికారేసిన శ్రీలంక

41.3 ఓవర్లు ముగిసే సమయానికి 300/4తో నిలిచిన శ్రీలంక జట్టు.. 400+ స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. కుశాల్ మెండిస్ కీలక సమయంలో ఔటవడంతో.. ఆఖర్లో నెమ్మదించింది.

Samayam Telugu 23 Oct 2018, 7:01 pm
సొంతగడ్డపై ఐదు వన్డేల సిరీస్‌ని ఇప్పటికే ఇంగ్లాండ్‌కి చేజార్చుకున్న శ్రీలంక.. ఆఖరి వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. కొలంబో వేదికగా ఈరోజు జరుగుతున్న ఐదో వన్డేలో డిక్వెల్లా (95: 97 బంతుల్లో 12x4), దినేశ్ చండిమాల్ (80: 73 బంతుల్లో 6x4, 2x6), కుశాల్ మెండిస్ (56: 33 బంతుల్లో 1x4, 6x6), సమరవిక్రమ (54: 48 బంతుల్లో 8x4) చెలరేగడంతో.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 366 పరుగుల భారీ స్కోరు చేసింది.
Samayam Telugu sri lanka vs england 5th odi fifty fest powers hosts to record total
ఇంగ్లాండ్‌ని ఆఖరి వన్డేలో ఉతికారేసిన శ్రీలంక


ఇంగ్లాండ్ బౌలర్లని ఆరంభం నుంచే ఉతికారేసిన ఓపెనర్లు డిక్వెల్లా, సమరవిక్రమ తొలి వికెట్‌కి 137 పరుగుల భాగస్వామ్యంతో లంకకి శుభారంభమివ్వగా.. అనంతరం మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్స్ వచ్చినవాళ్లు వచ్చినట్లు హిట్ చేశారు. దీంతో ఏ దశలోనూ ఇంగ్లాండ్ బౌలర్లు ఊపిరి పీల్చుకోలేకపోయారు. 41.3 ఓవర్లు ముగిసే సమయానికి 300/4తో నిలిచిన శ్రీలంక జట్టు.. 400+ స్కోరు చేసేలా కనిపించింది. కానీ.. కుశాల్ మెండిస్ కీలక సమయంలో ఔటవడంతో.. ఆఖర్లో నెమ్మదించింది. లంక జట్టు భారీ స్కోరు చేసినా.. కనీసం ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోయారు.

ఐదు వన్డేల ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దవగా.. రెండు, మూడు, నాలుగు వన్డేల్లోనూ ఇంగ్లాండ్ జట్టే గెలుపొందింది. దీంతో.. 0-3తో సిరీస్‌లో వెనకబడిన శ్రీలంక జట్టు ఆఖరి వన్డేలో ఇలా భారీ స్కోరుతో చెలరేగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.