యాప్నగరం

మూడో వన్డే: భారత్‌కు మళ్లీ ఛేజింగే

భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ పల్లెకెలెలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కపుగెదర బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

TNN 27 Aug 2017, 2:26 pm
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ పల్లెకెలెలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కపుగెదర బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని కపుగెదర చెప్పాడు. ‘రెండో వన్డేలో చాలా బాగా ఆడాం, కానీ విజయానికి ఆవలే నిలిచిపోయాం. అది గతం. ప్రస్తుత మ్యాచ్‌లు అన్ని రకాలుగా సిద్ధమయ్యాం. ఉపల్ ఎలాగు లేడు కాబట్టి తిరమన్నే జట్టులోకి వచ్చాడు. గుణతిలకకు గాయం కావడంతో అతని స్థానంలో చండిమాల్ ఆడుతున్నాడు’ అని టాస్ సందర్భంగా కపుగెదర చెప్పాడు.
Samayam Telugu sri lanka vs india 3rd odi sri lanka have won the toss and have opted to bat
మూడో వన్డే: భారత్‌కు మళ్లీ ఛేజింగే


ఇక కోహ్లి మాట్లాడుతూ.. ‘మా ప్రణాళికలో ఎలాంటి మార్పు లేదు. మొదటి రెండు గేమ్‌లు బాగా ఆడాం. కాకపోతే రెండో వన్డేలో మిడిలార్డర్ కాస్త తడబడింది. అదో మాకో మంచి పాఠం. మేం చాలా రిలాక్స్‌గా ఉన్నాం. దాదాపు మూడు వన్డేలు అడిన ప్లేయర్ మా వెనుక ఉన్నాడు. ధోనీకి ఇది 299వ వన్డే. భువీ ప్రశాంతంగా పనికానిస్తున్నాడు. కష్టాల్లో ఎలా ఆడాలో వీరిద్దరూ మాకు చూపించారు. దాన్నే మిగిలిన కుర్రాళ్లు ఫాలో అవుతారు. జట్టులో ఎలాంటి మార్పులు లేవు’ అని చెప్పాడు.

కాగా, ఈ మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ఎలా అయినా భారత్‌కు చెక్‌పెట్టి సిరీస్ పోరులో నిలవాలని శ్రీలంక పట్టుదలతో ఉంది. తుది జట్లు ఇలా ఉన్నాయి..
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, లోకేశ్ రాహుల్, ధోనీ, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చాహల్
శ్రీలంక: నిరోషన్ డిక్వెల్లా, లాహిరు తిరిమన్నే, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, మాథ్యూస్, కపుగెదర, సిరివర్దన, అఖిల ధనంజయ, చమీర, విశ్వ ఫెర్నాండో, లసిత్ మలింగ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.