యాప్నగరం

బాల్ ట్యాంపరింగ్: కెప్టెన్సీకి స్మిత్, వైస్ కెప్టెన్సీకి వార్నర్ గుడ్ బై

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా కెప్టెన్ పదవికి స్టీవ్ స్మిత్ గుడ్ బై చెప్పగా.. డేవిడ్ వార్నర్ కూడా అతడి బాటలోనే సాగాడు.

Samayam Telugu 25 Mar 2018, 2:22 pm
బాల్ ట్యాంపరింగ్ వివాదం నేపథ్యంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఈ వివాదం సంబంధం ఉన్న వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో చివరి రెండు రోజులు అతడి స్థానంలో వికెట్ కీపర్ టిమ్ పెయిన్ ఆసీస్ పగ్గాలను చేపడతాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్‌ల్యాండ్ ప్రకటించారు.
Samayam Telugu smith warner


బాన్‌క్రాప్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతిష్ట మసకబారింది. దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్ట్రేలియా ప్రధాని మార్కమ్ టర్న్‌బుల్ ఆదేశించారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపడుతోంది.

బాల్ ట్యాంపరింగ్ గురించి తనకు, ఇతర సీనియర్ ఆటగాళ్లకు ముందే తెలుసని స్మిత్ మూడో రోజు మ్యాచ్ ముగిశాక విలేకరుల సమావేశంలో చెప్పాడు. దీంతో స్మిత్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని మాజీలు డిమాండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.