యాప్నగరం

స్మిత్.. గత మూడేళ్లలో ఆ ఫీట్ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్

బాక్సింగ్ డే టెస్టులో భారీ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన స్మిత్ అరుదైన రికార్డులను అందుకున్నాడు.

TNN 30 Dec 2016, 2:47 pm
మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 165 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 624/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మెల్‌బోర్న్‌లో ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పాకిస్థాన్‌పై కూడా ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. మెల్‌బోర్న్‌లో గత మూడు ఇన్నింగ్స్‌లలో స్మిత్ 369 పరుగులు సాధించాడు. అంతకు ముందు రెండు ఇన్నింగ్స్‌లలోనూ 70 నాటౌట్, 134 నాటౌట్‌గా నిలిచాడు. ఈ గ్రౌండ్లో బ్రాడ్‌మ్యాన్ అత్యధికంగా 7 సెంచరీలు సాధించాడు. తర్వాతి స్థానంలో సట్‌క్లిఫ్, లారీ, ఇయాన్ ఛాపెల్, హెడెన్ ఉండగా.. ఇప్పుడు స్మిత్ వారి సరసన చేరాడు. గత మూడేళ్లుగా బాక్సింగ్ డే టెస్టులో స్మిత్ సెంచరీలు సాధించాడు. 2014లో భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసిన స్మిత్.. 2015లో విండీస్‌పై 134 & 70 పరుగులతో రెండు ఇన్నింగ్స్‌లలోనూ నాటౌట్‌గా నిలిచాడు.
Samayam Telugu steve smith is the only batsman who scored thousand runs in a year for the past three years
స్మిత్.. గత మూడేళ్లలో ఆ ఫీట్ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్


స్మిత్ ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు. 2014, 2015లోనూ స్మిత్ ఈ ఫీట్ సాధించాడు. గత మూడేళ్లుగా ఈ రికార్డు సాధించిన ప్లేయర్ స్మిత్ ఒక్కడే కావడం గమనార్హం. హెడెన్ వరుసగా ఐదేళ్లపాటు టెస్టుల్లో ఏడాదికి వెయ్యి పరుగుల చొప్పున సాధించాడు. తర్వాతి స్థానంలో ఉన్న లారా, ట్రోస్కోథిక్, పీటర్సన్ వరుసగా మూడేళ్లపాటు ఈ ఫీట్ అందుకున్నారు.


ఇప్పటి వరకూ 90 ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ టెస్టుల్లో 17 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. బ్రాడ్‌మ్యాన్ (50), సునీల్ గావస్కర్ (81), హెడెన్ (82) మాత్రమే స్మిత్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 17 శతకాలు సాధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.