యాప్నగరం

భయ్యా బీరేద్దామా?: రహానేతో స్మిత్

ధర్మశాల టెస్టు ముగిశాక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అజింక్య రహానే, ఇతర భారత క్రికెటర్ల దగ్గరకు వచ్చి బీర్ ఆఫర్ చేశాడు.

TNN 29 Mar 2017, 11:35 am
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం నుంచి భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో నడిచింది. ఆసీస్ ప్లేయర్ తమ తెంపరితనాన్ని చూపించారు. కంగారూల కెప్టెన్ స్మిత్ అయితే.. డీఆర్ఎస్ వివాదంలో ఇరుక్కోవడమే కాకుండా.. జడేజా, మురళీ విజయ్ లాంటి ఆటగాళ్లతో దుర్భాషలాడాడు. కానీ సిరీస్ ముగిశాక సారీ చెప్పి గుడ్ బాయ్ అనిపించుకోవడానికి ప్రయత్నించాడు.
Samayam Telugu steve smith offers beer to ajinkya rahane and indian team
భయ్యా బీరేద్దామా?: రహానేతో స్మిత్


ధర్మశాల టెస్టు ముగిశాక ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అజింక్య రహానే, ఇతర భారత క్రికెటర్ల దగ్గరకు వచ్చి బీర్ ఆఫర్ చేశాడు. సిరీస్‌లో మూడు సెంచరీలు బాది ఆకట్టుకున్న స్మిత్.. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పానని అంగీకరించాడు, సారీ చెప్పేశాడు. మ్యాచ్ అయిపోయన తర్వాత ఐపీఎల్‌లో తన టీం మేట్ అయిన అజింక్య రహానే దగ్గరకెళ్లి కాసేపు మాట్లాడాడు.

రహానే.. ఐపీఎల్ కోసం వచ్చే వారం కలుద్దామని చెప్పానని స్మిత్ ఏబీసీ గ్రాండ్‌స్టాండ్‌తో తెలిపాడు. సిరీస్ అయిపోయింది కాబట్టి కలిసి బీర్ తాగుదామా అని అడిగానని స్మిత్ చెప్పాడు. మరికొన్ని వారాలపాటు నేను రహానేతోనే కలిసి ఉంటాను. అతడు రైజింగ్ పుణే సూపర్ గెయింట్స్‌లో నా టీం మేట్ అని స్మిత్ చెప్పాడు. సిరీస్ ముగిశాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కలిసి బీర్ తాగడం ఆస్ట్రేలియా సంస్కృతిలో భాగం.

స్మిత్ సారీ చెప్పినా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోపం మాత్రం తగ్గలేదు. ఇక మీదట ఆసీస్ ప్లేయర్లు మా స్నేహితులు కారంటూ ఘాటుగా స్పందించాడు. అంతే మరీ చేయాల్సిందల్లా చేసి.. ఇప్పుడు బీరేద్దామా భయ్యా అంటే ఎవరికి మాత్రం మండదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.