యాప్నగరం

ఆసీస్ వైఫల్యానికి ఐపీఎల్ కారణమట!

పని భారం పెరిగిపోయిందని, అలసిపోతున్నామని వాపోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా చురకలు అంటించాడు.

TNN 23 Oct 2016, 3:39 pm
పని భారం పెరిగిపోతోందని, తీరిక లేని షెడ్యూల్ వల్ల అలసిపోతున్నామంటూ వాపోతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా చురకలు అంటించాడు. తామ గతంలో ఎన్ని రోజులు క్రికెట్ ఆడామో ఇప్పటి ప్లేయర్లు కూడా అన్ని రోజులే ఆడుతున్నారంటూ గుర్తు చేశాడు. గతంలో మాకు అందుబాటులో ఉన్న సదుపాయాలతో పోలిస్తే ఇప్పుడు వసతులు మెరుగైన విషయాన్ని గుర్తుకు చేశాడు. గతంలో తాము క్లబ్ క్రికెట్ కూడా ఆడేవారిమని, ఇప్పటి ఆటగాళ్లు దాని జోలికి పోవడం లేదంటూ విమర్శించాడు.
Samayam Telugu steve waugh counters australian cricketers workload concerns
ఆసీస్ వైఫల్యానికి ఐపీఎల్ కారణమట!

ఐపీఎల్‌లో ఆడటం వల్లే ఆటగాళ్లు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, వీలైతే ఐపీఎల్ ఆడటం మానేయాలని సూచించాడు. ఒకప్పుడు క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన ఆస్ట్రేలియా.. ఇటీవలి కాలంలో వైట్‌వాష్‌లకు గురవుతుండటాన్ని స్టీవ్ విశ్లేషించాడు. ఐపీఎల్ లో ఆడుతున్న కారణంగానే ఆటగాళ్లు అలసటకు గురవుతూ, తర్వాతి షెడ్యూళ్లలో తమ స్థాయికి తగిన ప్రదర్శన కనబరచలేక పోతున్నారని విమర్శించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.