యాప్నగరం

క్రికెట్: కోచ్‌గా స్టువర్ట్ లా నియామకం

ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. 48 ఏళ్ల లా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నాడు.

TNN 28 Jan 2017, 11:19 am
వెస్టిండీస్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా ఎంపికయ్యాడు. 48 ఏళ్ల స్టువర్ట్‌ను రెండేళ్ల కాలానికి కోచ్‌గా నియమిస్తూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫిల్ సిమన్స్ నాలుగు నెలల కిందట కోచ్ బాధ్యతల నుంచి వైదొలగ్గా.. నాటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. వెస్టిండీస్ కోచ్ పదవిని చేపట్టనున్న మూడో ఆస్ట్రేలియన్ స్టువర్ట్ కావడం విశేషం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వరల్డ్ కప్‌ జరగడానికి కొద్ది నెలల ముందు అంటే 2019 ఫిబ్రవరిలో లా కాంట్రాక్ట్ గడువు ముగియనుంది.
Samayam Telugu stuart law named west indies coach
క్రికెట్: కోచ్‌గా స్టువర్ట్ లా నియామకం


ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్‌లో విండీస్ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. దీంతో ఆ జట్టు నేరుగా ప్రపంచ కప్‌కు క్వాలిఫై కావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లోగా జట్టును టాప్-8లోకి తీసుకురావాల్సిన బాధ్యత కొత్త కోచ్‌పై పడనుంది. స్వల్ప తేడాతో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ జట్లు పాయింట్ల పట్టికలో విండీస్ కంటే ముందంజలో ఉన్నాయి. మార్చి నెలలో విండీస్ జట్టు సొంత గడ్డ మీద ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించడం కొత్త కోచ్‌కు కీలకం కానుంది.

వెస్టిండీస్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండటంపై లా ఆనందం వ్యక్తం చేశాడు. లా 2009 అక్టోబర్లో శ్రీలంక అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. 2011 తర్వాత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా అతణ్ని కోచ్‌గా నియమించుకోవాలని భావించింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైటాన్స్ ప్రధాన కోచ్‌గా లా వ్యవహరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.