యాప్నగరం

కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని

మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్‌లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.

TNN 26 Oct 2017, 1:55 pm
‘జట్టుకి ఒక్కసారి కెప్టెన్ అయితే.. అతను ఎప్పటికీ కెప్టెనే’ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి చెప్పిన మాట ఇది. నిజమే.. వన్డే, టీ20 పగ్గాలు వదులుకున్నా.. ధోనీ మాత్రం ఇప్పటికీ కెప్టెన్‌‌లానే మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేస్తూ.. బౌలర్లకి సూచనలు చేస్తుంటాడు. బుధవారం పుణె వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్‌ని ఔట్ చేసేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లికి, బౌలర్లకి ధోనీ సూచనలిస్తున్న మాటలు కొన్ని స్టంప్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి.
Samayam Telugu stump mic ms dhoni virat kohli kedar jadhav tom latham
కోహ్లి అక్కడ ఫీల్డర్లని ఉంచు: ధోని


గత ఆదివారం జరిగిన వాంఖడే వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్‌లతో శతకం సాధించి కివీస్‌ని గెలిపించిన టామ్ లాథమ్‌ని పుణె వన్డేలో ఔట్ చేసేందుకు ధోనీ వ్యూహం రచించాడు. ఇందులో భాగంగా విరాట్ కోహ్లిని.. మిడ్ వికెట్, స్కైర్ లెగ్ దిశగా 2-3 ఫీల్డర్లని ఉంచాలంటూ సూచనలు చేయడం మైక్‌లో రికార్డయ్యింది. అంతేకాకుండా.. కేదార్ జాదవ్ బౌలింగ్ చేస్తుంటే.. టామ్‌ లాథమ్‌కి ఎలాంటి బంతులు వేయాలో కూడా హిందీలో అతనికి చెప్పడం వీడియోలో కనిపించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లకి అర్థం కాకుండా ధోనీ హిందీలో సూచనలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడో వన్డే ఆదివారం కాన్పూర్‌లో జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.