యాప్నగరం

సుప్రీం కోర్ట్ Vs బీసీసీఐ: కీలక నిర్ణయాలు ఇవే!

సుప్రీం కోర్టు నిర్ణయం క్రీడా సంఘాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. పెద్దల చేతిలో విలవిల్లాడుతున్న క్రీడాకారుల జీవితాలకు మంచి రోజులు తెచ్చేలా సోమవారం తీర్పు వెల్లడించింది.

TNN 2 Jan 2017, 1:58 pm
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌ను తొలగిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతోపాటు లోధా కమిటీ సిఫార్సులను ఆమోదించింది. బీసీసీఐలో సభ్యుల ఎంపికపై సూచనలు ఇచ్చేందుకు ఇద్దరు న్యాయవాదులను సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. బోర్డు సభ్యుల అర్హతలపై జనవరి 19న వెల్లడిస్తామని సుప్రీం తెలిపింది. దేశంలో క్రికెట్‌ ప్రక్షాళన కోసం లోధా కమిటీ 2016, జులై 18న సుప్రీంకోర్టుకు సంస్కరణల నివేదికను అందించింది.
Samayam Telugu supreme removes anurag thakur as bcci president highlights
సుప్రీం కోర్ట్ Vs బీసీసీఐ: కీలక నిర్ణయాలు ఇవే!


70 ఏళ్ల వయస్సు పైబడిన వారు, రాజకీయ నేతలు క్రికెట్‌ సంఘాల్లోని ఏలాంటి పదవుల్లోనూ నియమించరాదనే కమిటీ సూచనలను బీసీసీఐ వ్యతిరేకించింది. నివేదిక కోర్టులో ఉండగానే అజయ్‌ శిర్కేను కార్యదర్శిగా నియమించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అనురాగ్‌ను హెచ్చరించింది. సోమవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ శిర్కేలపై వేటు వేసింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఇవీ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.