యాప్నగరం

అభయ్ నేగి 6, 6, 6, 6.. 14 బంతుల్లో 50 రన్స్

భారత్‌లో మరో యువ పవర్ హిట్టర్ వెలుగులోకి వచ్చాడు. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సిక్సర్ల వర్షం కురిపించిన అభయ్ నేగీ కేవలం 14 బంతుల్లో 50 పరుగులు సాధించేశాడు.

Samayam Telugu 18 Nov 2019, 5:25 pm
భారత దేశవాళీ టీ20 టోర్నీ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ’లో మేఘాలయ హిట్టర్ అభయ్ నేగి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో తాజాగా జరిగిన మ్యాచ్‌లో మిజోరాం బౌలర్లని ఉతికారేసిన అభయ్ నేగి (50 నాటౌట్: 15 బంతుల్లో 2x4, 6x6) ట్రోఫీ చరిత్రలోనే వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
Samayam Telugu Abhay Negi
Photo credit: Screengrab from BCCI video


Read More: రోహిత్ శర్మ సీరియస్.. ఇంకా ఆ డిఫెన్స్ ఏంటి..?

ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన అభయ్ నేగి.. భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో 20 పరుగులు చేసిన నేగి.. ఆ తర్వాత ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన లాల్బియాక్వేలా బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాదేశాడు. ఆ ఓవర్‌లో ఫస్ట్ బంతిని ఫోర్‌గా బాదిన అభయ్ నేగి.. మరో నాలుగు బంతుల్ని బౌండరీ వెలుపల పడేలా సిక్సర్లుగా తరలించేశాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే ఈ యువ హిట్టర్ తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకోవడం విశేషం.

Read More: ధోనీలా రనౌట్ చేయబోయి బోల్తాకొట్టిన మేఘాలయ వికెట్ కీపర్

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో తడబడిన మిజోరాం టీమ్ 182/2కే పరిమితమైంది. ఓపెనర్ తరువార్ కోహ్లి (90: 59 బంతుల్లో 7x4, 4x6) మెరుపు ఇన్నింగ్స్‌తో మిజోరాం టీమ్‌ని గెలిపించేందుకు ప్రయత్నించాడు. కానీ.. అతడ్ని అభయ్ నేగీనే క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్‌‌లో మేఘాలయాని గెలిపించాడు.

India vs West Indies సిరీస్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్, వైజాగ్‌లో మ్యాచ్‌లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.