యాప్నగరం

అంధుల టి20 ప్రపంచ కప్ విజేత భారత్

భారత అంధుల క్రికెట్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. పొట్టి క్రికెట్‌లో తమకు సాటి ఎవరూలేరని చాటి చెప్పింది.

TNN 12 Feb 2017, 4:02 pm
భారత అంధుల క్రికెట్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. పొట్టి క్రికెట్‌లో తమకు సాటి ఎవరూలేరని చాటి చెప్పింది. ఈ మేరకు టి20 ప్రపంచ కప్‌ను భరత జాతికి కానుకగా ఇచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
Samayam Telugu t20 blind world cup india beat pakistan by 9 wickets to win wc
అంధుల టి20 ప్రపంచ కప్ విజేత భారత్


భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అదరగొట్టింది. కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. 17.4 ఓవర్లలో 200 పరుగులు చేసి ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్ ప్రకాశ జయరామయ్య చెలరేగి ఆడాడు. కేవలం 60 బంతుల్లో 99 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తం 15 ఫోర్లు బాదిన జయరామయ్య నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ అజయ్ కుమార్ రెడ్డి (43) కొంచెంలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.

పాకిస్థాన్ తరఫున ఓపెనర్ బాదర్ మునీర్ (57) అత్యధిక స్కోరు సాధించాడు. మరో ఓపెనర్ మహ్మద్ జమీల్ (24) మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ 20 పరుగులు దాటలేకపోయారు. భారత బౌలర్లలో మహ్మద్ జాఫర్ ఇక్బాల్, కేతన్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అజయ్ కుమార్ రెడ్డి, సునీల్ చెరో ఒక వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.